‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న సంచలన చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ భారీ మల్టీస్టారర్ గురించి అప్ డేట్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కరోనా తర్వాత హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేసిన జక్కన్న చాలా స్పీడుగా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, చరణ్ ల పై యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. అలాగే చరణ్, అలియాభట్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
అయితే.. న్యూయర్.. అలాగే సంక్రాంతి వస్తుంది కాబట్టి ‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఏదైనా అప్ డేట్ ఉంటుందా..? అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. జక్కన్న మాత్రం న్యూయర్, సంక్రాంతికి కాకుండా రిపబ్లిక్ డేకి ప్లాన్ చేశారని తెలిసింది. నిజంగా ఆరోజునే అప్ డేట్ ఇవ్వనున్నారట. ఏంటంటే.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లతో పోస్టర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారట. అయితే.. పోస్టర్ రిలీజ్ చేస్తారా..? లేక టీజర్ రిలీజ్ చేస్తారా..? అనేది తెలియాల్సివుంది. ఇదిలా ఉంటే.. తదుపరి షెడ్యూల్ ను జనవరి 4కి ప్లాన్ చేసారు. అయితే.. చరణ్ కి కరోనా రావడంతో జనవరి 7 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.
మార్చి నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేయాలనేది జక్కన్న ప్లాన్. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. అయితే.. ఈ సంచలన చిత్రాన్ని 2021 దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.