‘అంతరిక్షం’ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనన్ని సినిమాలొచ్చాయి. ఇండియన్ స్ర్కీన్ పై కూడా అలాంటి ప్రయత్నాలు జరిగాయి. తెలుగులో కూడా స్పేస్ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. వరుణ్ తేజ హీరోగా ‘అంతరిక్షం’ పేరుతో ఒక సినిమా రావడం తెలిసిన సంగతే. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాల్ని తరచుగా తీస్తూ ఉంటారు. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు అంతరిక్షంలో ఉండే భావనే కలుగుతుంది. వాస్తవానికి గ్రీన్ మ్యాట్లోనూ, సెట్టింగ్స్ లోనూ చిత్రీకరించి.. దానికి గ్రాఫిక్స్ జోడించడం వల్ల అదే అంతరిక్షమేమో అన్నంత రియల్ గా చిత్రిస్తారు. అంతేకానీ.. చిత్రం యూనిట్ అంతరిక్షానికి వెళ్ళి చిత్రీకరించరు .
అంతరిక్షంలోకి వెళ్ళడం అంటే .. సాహసంతో కూడిన పని. కోట్ల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. స్పేస్ మీదకు సైంటిస్టులు వెళ్ళడమే చాలా కష్ట సాధ్యమైన పని. కానీ తొలి సారిగా ఒక చిత్ర బృందం అంతరిక్షంలోకి వెళ్ళి సినిమా షూటింగ్ జరపనుండడం విశేషంగా మారింది. ‘ఛాలెంజ్’ పేరుతో త్వరలోనే ఒక రష్యన్ సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమా చిత్రీకరణను అంతరిక్షంలోనే జరపనున్నారు. దీనికోసం చిత్ర యూనిట్ మొత్తం శిక్షణ తీసుకుంటున్నారట.
చిత్ర యూనిట్ అంతా రాకెట్లో అంతరిక్షానికి వెళ్ళి అక్కడే చిత్రీకరణ జరపనున్నాడట. క్లిమ్ షిఫెన్కో అనే దర్శకుడు ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడు. రష్యాకి చెందిన స్పేస్ ఏజెన్సీ.. రోస్ కాస్కోస్ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ అంతరిక్షంలో చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇందులో యూలియా పెర్సిల్డ్ ప్రధాన పాత్ర పోషించబోతోంది. ఏడాది అక్టోబర్ లో ఓ రష్యన్ రాకెట్ ద్వారా చిత్ర బృందాన్ని అంతరిక్షంలోకి పంపి.. అక్కడే సినిమాను లాంచ్ చేయబోతున్నారట.
Must Read ;- ప్రధాని మోడి మెచ్చుకున్న మాధవన్ ‘రాకెట్రీ’ ట్రైలర్