2018 ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌కి సంబంధించిన పరీక్ష ఫలితాల్లో లోపాలున్నాయని, అక్రమాలు జరిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ అక్రమాలపై విచారణ జరగని పక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
‘సరైన విధానం లేకుండా తొందరపాటుతో డిజిటల్ మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపికలో గందరగోళం, డిజిటల్ పద్దతిలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో పాటు పలు అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ అంశం 6వేల మంది అభ్యర్థులకు సంబంధించి మాత్రమే కాదు.. రానున్న కాలంలో పాలనా సంబంధించిన విశ్వసనీయమైన వ్యవస్థలో భాగస్వాములకు సంబంధించిన అంశం. ఈ ఎంపికలో లోటుపాట్లు సరిదిద్దాలి. అభ్యర్థులకు న్యాయం చేయాలి. లేదంటే మరో పోరాటానికి సిద్ధం’ అని తెలిపారు.
ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన
ఇక 2018లో నోటిపికేషన్ జారీ కాగా 2020 డిసెంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 9,679 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాశారు. ఏపీలోని 13జిల్లాల్లో 34 కేంద్రాలు ఉండగా హైదరాబాద్‌లో 7 కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు.ఈ ఫలితాలను గత బుధవారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 28న ప్రకటించింది. ఇంటర్వ్యూకి అర్హత సాధించిన అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అయితే ఇంటర్వ్యూలకు సంబంధించి అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం పదోతరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పట్టుబట్టిన నేపథ్యంలో ప్రతిపక్షపార్టీలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. టీడీపీ పెద్దయెత్తున ఆన్ లైన్ ఉద్యమం చేపట్టింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేస్తుంటే..జగన్ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లోకూడా పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులపై కొవిడ్ ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. న్యాయపోరాటం కూడా చేశారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయం సమిష్టి విజయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.
లోకేష్ మరో ట్వీట్‌లో..
మరో ట్వీట్‌లో లోకేష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.వైఎస్ జగన్ ఆధిపత్య రాజకీయాలపై పెట్టే శ్రద్ధ ఆక్సిజన్ అందించడంపై పెడితే బాగుంటుందని విమర్శించారు. ఆక్సిజన్ అందక అనేక మంది చనిపోతున్నా జగన్ కు రాజకీయాలు చేస్తున్నారని, నీరో చక్రవర్తిలా మారారని విమర్శించారు. ఆక్సిజన్ అందక కొవిడ్ బాధితులు ఇబ్బంది పడుతున్న కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకు, నేతలను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం తన సమయాన్ని కేటాయిస్తోందన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే హిందూపురం ఆసుపత్రిలో 8మంది, కర్నూలులో ఆరుగురు, అనంతపురంలో 10 మంది, విజయనగరంలో పలువురు రోగులు చనిపోయేవారు కాదని విమర్శించారు. అక్సిజన్‌పై శ్రద్ధ పెట్టకుండా అధికారులు, పోలీసులు, వాలంటీర్లను తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్ల కోసం, ఉత్తరాంధ్ర ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు పెట్టడం కోసం సమయాన్ని వెచ్చించారని విమర్శించారు. రక్షణగా ఉంటారని ప్రజలు వైసీపీని ఎన్నుకుంటే ప్రతిపక్షంపై కక్ష తీర్చుకుంటున్నారని ట్వీట్ చేశారు.
It is not just about the fate of 6000+ candidates, it’s about credibility of system that selects our future administrators. APPSC & Govt. must take immediate steps to correct faults in evaluation brought to their notice. If not, I'll be forced to take a more active part. (2/2)
— Lokesh Nara (@naralokesh) May 4, 2021











