‘అతడు, ఖలేజా’ చిత్రాలు మహేశ్ బాబు కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైనవి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో ఈ రెండు సినిమాలు చాటిచెప్పాయి. అందుకే ఇప్పుడు మహేశ్ బాబు 28 సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అతడు చేయబోతున్న మూడో సినిమా కావడంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకి అభిమానులు ఎంతో ముచ్చటపడే టైటిల్ ను ఖాయం చేయబోతున్నారట.
‘అతడు’ సినిమాలో మహేశ్ బాబు పాత్ర ఒరిజినల్ పేరు నందగోపాల్. తన కారణంగా ట్రైన్ లో పోలీసుల కాల్పుల్లో చనిపోయిన రాజీవ్ కనకాల కుటుంబాన్ని ఆనందపరచాలనే ప్రయత్నంలో ‘పార్ధు’ అనే అతడి పేరుతోనే ఆ ఇంట్లోకి ఎంటరవుతాడు. అదే పేరుతో ఆ ఇంట్లో వారికి , ఊరివారికి బాగా కాల్సినవాడు అవుతాడు. అటు ప్రొఫెనల్ కిల్లర్ గానూ, ఇటు ఫ్యామిలీ మేన్ గా అనితర సాధ్యంగా నటించిన మహేశ్ బాబుకి ఈ సినిమా ఎంతో మంది అభిమానుల్ని ఏర్పరిచింది.
అందుకే ‘పార్ధు’ అనే టైటిల్ ను త్రివిక్రమ్.. తమ కాంబోలోని మూడో సినిమా ఖాయం చేశాడని టాక్స్ వినిపిస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకోబోతున్న ఈ సినిమా అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతోంది. ఇక ఈ సినిమా దిశా పటానీ కథానాయికగా నటిస్తోందని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ సినిమాకి నిజంగానే ‘పార్ధు’ టైటిల్ నే ఫిక్స్ చేస్తారేమో చూడాలి.