మంగళగిరి సాక్షిగా జగన్‌కి లోకేష్ సూపర్ షాక్…!!
మంగళగిరి… టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేయబోయే నియోజకవర్గం.. గత ఎన్నికలలో ఆయనపై విషప్రచారం చేసి మరీ గెలిచింది వైసీపీ.. మంగళగిరిలో మరోసారి లోకేష్‌ని ఓడించి తమ కంచుకోటగా మలుచుకోవాలని భావిస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు.. దీనికోసం కరకట్ట కమల్ హాసన్ కేంద్రంగా వారు వేయని ఎత్తులు లేవు..
లోకేష్‌కి చెక్ పెట్టడంలో భాగంగా….. మంగళగిరిలో R5 జోన్‌లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది జగన్ సర్కార్.. నియోజకవర్గంతో సంబంధంలేని వారిని తీసుకువచ్చి అక్కడ వారికి భూములని పంచిపెట్టింది.. ఒక్కొక్కరికి సెంటు భూమిని కేటాయించింది.. ఈ వేల మంది ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని రాబోయే ఎన్నికలలో లోకేష్‌కి వ్యతిరేకంగా ఓటు వేస్తే, మరోసారి ఆయన ఓటమి ఖాయమని లెక్కలు కట్టింది తాడేపల్లి ప్యాలెస్ టీమ్.
సరిగ్గా దీనినే తనకు అవకాశంగా మలుచుకుంటున్నారు లోకేష్.. పేదలకు ఆర్5 జోన్‌లో ఎక్కడయితే పట్టాలు ఇచ్చారో అక్కడే తన పాదయాత్రలో భాగంగా శిలాఫలకం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు లోకేష్.. మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు 20వేలకు పైగా గృహాలు నిర్మించి ఇచ్చే బాధ్యత తనది అని హామీ ఇస్తూ శిలాఫలకం వేస్తున్నారు..
అంతేకాదు, నియోజకవర్గంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములలో నివాసం ఉంటోన్న వారికి సైతం పట్టాలు ఇప్పించే బాధ్యత తనది అని ఆ శిలాఫలకంలో హామీ ఇవ్వనున్నారు.. సరిగ్గా ఈ రెండింటిపైనే వైసీపీ పెద్దలు మంగళగిరిలో రాజకీయం చేయాలనుకుంటున్నారు.. లోకేష్ చుట్టూ వలయం సృష్టించాలనుకున్నారు.. తాజాగా ఈ రెండు అంశాలపై టీడీపీ యువనేత స్పష్టమైన హామీ ఇవ్వడంతో, వైసీపీ డైలమాలో పడింది..
ఇటు ఆర్ 5 జోన్‌లో జగన్ సర్కార్ ఇచ్చిన భూములపై హై కోర్ట్ స్టే విధించింది.. దీంతో, జగన్ సర్కార్ మోసం తెలిసి వచ్చింది అక్కడి పేదలకి.. పట్టాలు అందుకున్నా, వారికి ఎలాంటి హక్కులు ఉండవని హై కోర్టు తెలిపింది.. వీటిపైనా అబద్ధాలు పలికింది జగన్ సర్కార్.. వీటి అన్నింటికీ భిన్నంగా లోకేష్, స్పష్టమైన హామీ ఇస్తున్నారు..
మొత్తమ్మీద, మంగళగిరిలో లోకేష్‌ని ఫిక్స్ చేయాలని భావించిన తాడేపల్లి పెద్దల ఎత్తుకి లోకేష్ పైఎత్తు వేశారు.. మరి, తాడేపల్లి టీమ్ మళ్లీ ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు పన్నుతుందో చూడాలి..