సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాదిని ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ తో శుభారంభం చేశాడు. ఆ వెంటనే ఒకరిద్దరు టాప్ డైరెక్టర్స్ తో సినిమా చేయాలనుకున్నా.. స్ర్కిప్ట్ విషయంలో రాజీ పడని మహేశ్ బాబు.. ఆ స్థానంలో పరశురామ్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలోని కథకి ఆయన బాగా ఇంప్రెస్ అయి వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేశ్. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా రెగ్యులర్ షూటింగ్ కు బ్రేక్ పడింది. దాదాపు ఎనిమిది నెలల అనంతరం ఈ సినిమా షూటింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి.
అన్ లాక్ లో షూటింగ్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో అందరు స్టార్ హీరోలు తమ తమ సినిమాల్ని తిరిగి పట్టాలెక్కిస్తున్నారు. ఆ క్రమంలో మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ సినిమా కూడా షూటింగ్ కు సిద్ధమవుతోంది. సినిమాలోని మేజర్ పార్ట్ యూఎస్ లో చిత్రీకరించాల్సి ఉంది. అయితే చిత్ర యూనిట్ కు వీసా సమస్యలు రావడంతో సినిమా షూటింగ్ కు ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ చిత్ర యూనిట్ వీసాకి మళ్ళీ అప్లై చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం మహేశ్ బాబు విదేశాల్లో ఫ్యామిలీతో విహరిస్తున్నాడు. ఈ టైమ్ లో ఔట్ డోర్ షూటింగ్ కు రావడానికి తాను సిద్ధమేనంటున్నాడు. అంటే దానర్ధం తను ‘సర్కారువారి పాట’ సినిమాలో నటించడానికి సిద్ధమే అని అంటున్నట్టే కదా. వీసా సమస్యలు పరిష్కారమైతే.. త్వరలోనే సర్కారు వారి పాట యూఎస్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో కథానాయికగా మహానటి కీర్తి సురేశ్ ఎంపికైన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ ఎంత తొందరగా ప్రారంభమవుతుందో చూడాలి.











