సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న తాజా షెడ్యూల్ ఈ రోజు నుంచి హైదరాబాద్లో జరుగుతోంది. మహేష్ బాబు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో జాయిన్ కానున్నారు. అయితే.. మహేష్ నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు. ఈ చిత్రాన్ని గతంలో ప్రకటించారు కానీ.. కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఈ సినిమా గురించి తాజా వార్త ఏంటంటే.. ఫిబ్రవరి 3న హైదరాబాద్లో ఈ చిత్రాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభించడానికి ముహుర్తం ఫిక్స్ చేశారని తెలిసింది. ఇక రెగ్యులర్ షూటింగ్ మార్చి లేదా ఏప్రిల్‌లో స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డేనే ఫైనల్ చేశారు. ఈ సినిమా కోసం ఇప్పటికే త్రివిక్రమ్, థమన్ మ్యూజిక్ సెషన్స్ స్టార్ట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అతడు, ఖలేజా చిత్రాలు ఇద్దరికీ మంచి పేరు తీసుకువచ్చాయి. దీంతో మహేష్, త్రివిక్రమ్ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటుంటే.. 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. దీంతో ఈ భారీ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి… మహేష్, త్రివిక్రమ్ ఈసారి ఏ రేంజ్ సక్సస్ సాధిస్తారో చూడాలి.











