వనజాక్షిని కాపాడింది నేనే..
తహసీల్దార్ వనజాక్షి విషయంలో ఒక తరహా మీడియా సంస్థలు తప్పుడు వార్త కథనాలను ప్రసారం చేసి, తనను బ్లేం చేశాయని తెలుగు దేశం పార్టీ సినీయర్ నాయకులు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. వనజాక్షిని కొట్టింది డ్వాక్రా మహిళలు అని, ఆమె కిందపడితే లేవదీసి నీళ్లిచ్చింది తానేనని ప్రభాకర్ చెప్పుకొచ్చారు. అయితే మీడియా తనను కావాలనే విలన్ గా చిత్రికరించిందని, వనజాక్షిపై దాడి జరిగిన సమయంలో తాను ఏలూరు ప్రెస్ మీట్ లో ఉన్నానని వివరించారు. అక్కడ ఇసుక వ్యాపారం చేస్తోందని డ్వాక్రా మహిళలని, గొడవును సద్దుమనిగించేందుకే అక్కడకు వెళ్లానని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలకు ఇసుక వ్యాపారం అప్పగించారని, అందులో ఎమ్మెల్యేల జోక్యం ఎక్కడ ఉండదని గుర్తుచేశారు. ఇసుక తవ్వకాల్లో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు అక్కడకు వెళ్లగా.. అప్పుడే వనజాక్షిపై డ్వాక్రా మహిళలు దాడికి యత్నించారు. ఆ సమయంలో ఆమెకు నీళ్లిచ్చి, వారి నుంచి ఆమెను కాపాడానని చెప్పారు.
ఇమేజ్ కోసమే యూటర్న్..
వనజాక్షి విషయంలో తాను దిద్దుకోలేని తప్పు చేశానని మాజీ ఎమ్మెల్యే చింతమని ప్రభాకర్ చెప్పారు. డ్వాక్రా మహిళలు వనజాక్షిపై దాడిచేస్తే.. అమె ఇసుకలో కూరుకుపోయిందని, అప్పుడు నేనే వెళ్లి ఆమెకు వాటర్ బాటిలిచ్చి కాపాడానని చెప్పారు. అయితే ఆ సమయంలో నేను అక్కడే ఉంటే ఇటువంటి ఆరోపణలు నాపై రాకుండా ఉండేదని, నేను అక్కడ నుంచి వెళ్లిన తరువాత వనజాక్షి యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. డ్వాక్రా మహిళలు కొట్టారంటే ఆమెకు ఇమేజ్ రాదని, అందుకే నేను కొట్టానని క్రియేట్ చేసిందని ఆరోపించారు. ఆమెను నేనేదో చేశానని జగన్ పత్రిక సహా మీడియా అంతా కలిసి.. నా జీవితంతో ఆడుకున్నారని వాపోయ్యారు. వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చానని జగన్ కట్టు కథలు చెబుతుంటే.. ఇదేంటి సార్ అని నేను మైక్ అడిగితే ఆయన నన్ను మాట్లాడొద్దన్నారు. ఇందులో నా తప్పేమి లేదని మా నాయకుడు చంద్రబాబుకు తెలుసు అని చెప్పారు.
Must Read:-తెలుగుదేశంలో నవ్యోత్తేజం!