ఇటీవల ‘జాతిరత్నాలు’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు కమెడియన్ ప్రియదర్శి. ఓవర్సీస్ లో సైతం సినిమా దుమ్మురేపేసింది. అయితే ఈ ఏడాది అతడికి అదే పెద్ద అచీవ్ మెంట్ అనుకుంటే.. ఇప్పుడు దానికి మరొకటి తోడైంది. అదేంటంటే.. ఈ ఏడాది ప్రారంభంలో .. ఆహాలో ‘కంబాలపల్లి కథలు’ అంటూ ఓ వెబ్ ఫిల్మ్ సిరీస్ ను రూపొందించారు స్వప్నా మూవీస్ వారు. అందులో చాప్టర్ వన్ గా ‘మెయిల్’ అనే వెబ్ ఫిల్మ్ స్ట్రీమ్ అయింది. విడుదలైన రోజునుంచీ ఆ ప్రయోజనాత్మక మూవీ మంచి పేరు తెచ్చుకుంది.

కంబాల పల్లి గ్రామంలో కంప్యూటర్ వచ్చిన కొత్తల్లో జరిగిన పక్కా పల్లెటూరి కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఉదయ్ గుర్రాల దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ మూవీలో ఓ ప్రేమకథ కూడా రన్ అవుతుంది. ప్రియదర్శి, హర్షిత్, గౌరీప్రియ, ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ గుడ్ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అదేంటంటే.. మెయిల్ మూవీ ఈ ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ కు సెలెక్ట్ అయింది. ఈ సందర్భంగా నిర్మాతలు, ప్రియదర్శి సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ జూన్ 4 నుంచి ప్రారంభం కాబోతోంది. మరి ‘మెయిల్’ మూవీకి ఇంకెంత పేరొస్తుందో చూడాలి.
#Mail has been now an 'Official selection at the New York Indian Film Festival'.
A big thanks to each and everyone who made it possible♥️ #ReasonToSmile @SwapnaCinema @ahavideoIN #UdayGurrala pic.twitter.com/Rl2Y41q75N
— Priyadarshi Pulikonda (@Preyadarshe) May 8, 2021











