స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత.., మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత ఏపీలో రాజకీయ పరిణామాలు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అనంతరం రిమాండ్ పై రాజమండ్రికి తరలింపు.., ఆ తరువాత ఇన్నరింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసుల్లో పీటీ వారెంట్ పిటిషన్ కు కోర్టు అనుమతులు తీసుకోవడం వంటి జగన్ గేమ్ ప్లాన్ లో భాగం. ఇలా చంద్రబాబును ఆ కేసు.. ఈ కేసు అంటూ జైల్లో కూర్చొపెట్టే దురుద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పన్నాగాలను చెక్ పెట్టేందుకు లోకేష్ గత నెల 14న ఢిల్లీ వెళ్లారు. అక్కడ న్యాయ నిపుణులతో వరసగా భేటి అయ్యారు. తగిన సలహాలు.. సూచనలు తీసుకున్నారు. జాతీయ పార్టీల నేతలతో ములాఖత్ అయ్యారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని.., వైసీపీ ఏపీలో సాగిస్తున్న దుష్ట పాలనను వివరించారు. అలానే జాతీయ స్థాయిలో మీడియా వరుస ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి.. విపక్షాలతో ఆయన తీరును దేశానికి అర్థమయ్యే చెప్పారు.
ఈ క్రమంలో ఇది గమనించిన జగన్ అండ్ కో.. లోకేష్ ను పైబర్ గ్రిడ్ కేసులో అక్రమంగా ఇరికించి.. అరెస్ట్ చేయాలని చూశారు. దీనిపై న్యాయం స్థానాన్ని ఆశ్రయించిన లోకేష్ కు .. ఆయనను అరెస్ట్ చేయవద్దని సీఐడీకి న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా మోతమోగిద్దాం.., సత్యమేవ జయతే కార్యక్రమాల ద్వారా చంద్రబాబు పై అక్రమంగా బనాయించిన కేసులపై నిరసన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో 21 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబుకు జరిగిన అన్యాయంపై జ్యుడిషియల్ పరంగా..,మీడియా..,పొలిటికల్ పరంగా విజయవంతమైన భేటీలను ముగించుని లోకేష్ తిరిగి ఏపీకి వస్తున్నారు.
ఢిల్లీ నుంచి గన్నవరం వరకు విమానంలో వచ్చి.. రోడ్డు మార్గంలో రాజమండ్రికి వెళ్ళనున్నారు లోకేష్. రేపు చంద్రబాబుతో రాజమండ్రి జైల్లో ములాఖత్ అవుతారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు విషయంలో క్లారిటీ వచ్చి ఉంది. అయితే దీనిపైనే చంద్రబాబు జైలు నుంచి లోకేష్ కు దిశనిర్ధేశం చేయనున్నారు. ఆ తరువాత ఇరు పార్టీ ఐక్య కార్యచరణకు తెలుగుదేశం పార్టీ నుంచి ఐదుగ్గురిని ఎంపిక చేసి.. వారిని జనసేన తో కలిసి శ్రేణులను ఎలా ముందుకు నడపాలో లోకేష్ డైరెక్షన్ చేస్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపై.., అక్రమ అరెస్ట్ లపై ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ .. ఎంపిక చేసిన ఇరు పార్టీల ఐక్య కార్యకచరణ కమిటీ ముందుకు పోనున్నది. అనంతరం 9 న సుప్రీంలో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసు క్వాష్ పిటిషన్ విచారణ ఉన్న నేపధ్యంలో తిరిగి లోకేష్ ఢిల్లీ వెళ్ళనున్నారు.










