బిఫోర్ లాస్టియర్ మలయాళంలో విడుదలై.. బ్లాక్ బస్టర్ హిట్టైన చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’ . పృధ్విరాజ్ సుకుమారన్, సురాజ్ వెంజారమూడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ఒక సూపర్ స్టార్ కి, అతడి అభిమానికి మధ్య ఇగో క్లాషెస్ నేపథ్యంలో రూపొందింది. అయితే ఈ సినిమా రీమేక్ రైట్స్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకొని చాలా రోజులు అయింది. అయితే ఈ సినిమాను ఎవరితో తీయాలి అనే విషయంలో ఇంత వరకూ క్లారిటీ రాలేదు.
మొదట్లో ఈ సినిమా పవర్ స్టార్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతోంది అనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత రవితేజ పేరు వినిపించింది. అలాగే అభిమాని పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు కూడా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ పేరు కూడా వినిపించింది. ఫైనల్ గా ఇప్పుడు రవితేజ తోనే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇందులో మాస్ రాజా చేయబోయేది సూపర్ స్టార్ పాత్ర అంటున్నారు. ఇక ఇందులో మరో పాత్ర కోసం సరైన నటుడ్ని అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.
అతి త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందట. మలయాళంలో ఈ సినిమాను నటుడు లాల్ తనయుడు జూనియర్ లాల్ తెరకెక్కించాడు. మరి తెలుగు వెర్షన్ ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంలో కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మరి తెలుగు డ్రైవింగ్ లైసెన్స్ కు డైరెక్టర్ ఎవరవుతారో చూడాలి.