తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.ఆగస్టు 5,2019లో వచ్చిన భారత రాజ్యాంగం చట్టం 170 ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నారు.2014లో వచ్చిన ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం డీలిమిటేషన్ చేయాలని కోరారు. ఈ చట్టం ప్రకారం తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నుంచి 153కు, ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నుంచి 225కు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. ఇవన్నీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం జరగాలన్నారు. జమ్ము కాశ్మీర్ తరహాలోనే తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. అంతేకాకుండా ఏపీ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఎన్నికల సంఘం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న రెవెన్యూ మండలాలను ఏపీకి కేటాయించినట్లు తెలిపారు. ఈ మండలాలపై కూడ రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకోవాలని శశిధర్ రెడ్డి కోరారు.
జగన్పై అమిత్ షా కామెంట్స్.. వైసీపీకి డేంజర్ బెల్స్…!!
కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో బీజేపీ కీలక నేత అమిత్ షా...మొన్నటి...