మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. చిరు – చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూవీని సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్ లో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ భారీ చిత్రాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేసారు.
తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇందులో చాలా మార్పులు చేసారు. మోహన్ రాజా చేసిన మార్పులకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని.. అభిమానులకే కాకుండా ప్రతి ఒక్కరికీ నచ్చేలా కథ ఉంటుంది అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. చిరంజీవి యంగ్ హీరో సత్యదేవ్ కి ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చారట. ఈ సినిమాలోని ఓ పాత్రకు స్వయంగా చిరంజీవే సత్యదేవ్ కి ఇవ్వమని చెప్పారట. అయితే.. ఏ పాత్ర కోసం సత్యదేవ్ ని తీసుకున్నారనేది మాత్రం తెలియాల్సివుంది. అయితే వస్తున్న వార్తల్ని బట్టి.. ఒరిజినల్ లో టోవినో థామస్ చేసిన యువ ముఖ్యమంత్రి పాత్ర కోసం సత్యదేవ్ ఎంపికయినట్టు తెలుస్తోంది. ఇక ‘లూపీఫర్’ రీమేక్ ను ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
సత్యదేవ్ ఇటీవల ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ఓటీటీలో సక్సస్ సాధించాడు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ‘తిమ్మరుసు, గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో నటిస్తున్నాడు. . మొత్తానికి సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సినిమాతో సత్యదేవ్ కి మరింత క్రేజ్ రావడం ఖాయం.