‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో విభిన్న కథా దర్శకుడు అనిపించుకున్నాడు నాగ్ అశ్విన్. ఆతర్వాత ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డ్ సైతం దక్కించుకుని సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమాని ఎనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా.. నాగ్ అశ్విన్ మామూలోడు కాదు అనిపించాడు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు బిగ్ బి అమితాబ్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునేలు కూడా నటిస్తుండడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకుండానే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ మూవీని ఎనౌన్స్ చేశాడు. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లకుండానే ‘సలార్’ మూవీని ప్రకటించాడు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల కంటే ముందుగా ‘సలార్’ మూవీని స్టార్ట్ చేస్తున్నారు. దీంతో నాగ్ అశ్విన్ తో ఎనౌన్స్ చేసిన సినిమా ఏమైంది.? అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రభాస్ ‘సలార్’ మూవీని జనవరిలో స్టార్ట్ చేసి ఏప్రిల్ కి కంప్లీట్ చేస్తామన్నారు. ఆతర్వాత బాలీవుడ్ మూవీ ‘ఆదిపురుష్’ స్టార్ట్ చేస్తామని.. ఈ సినిమాని 2022 ఆగష్టు 11న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఆదిపురుష్ అయిన తర్వాత నాగ్ అశ్విన్ తో మూవీ మొదలవుతుందన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేయనున్న మూవీని మార్చి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. మార్చి నుంచి నాగ్ అశ్విన్ తో మూవీని స్టార్ట్ చేస్తే.. ఆదిపురుష్ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు..? ఆదిపురుష్ మూవీకి ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. మొత్తానికి నాగ్ అశ్విన్ తన స్టేట్ మెంట్స్ తో.. మరోసారి కన్ ఫ్యూజన్ లో పడేశారు. అసలు.. నాగ్ అశ్విన్ ప్రభాస్ తో మూవీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.? ఆదిపురుష్ కోసం ఎప్పుడు బ్రేక్ ఇస్తారు.? ఇలా పూర్తి వివరాలు ప్రకటిస్తే.. ఎలాంటి కన్ ఫ్యూజన్ ఉండదు. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.