టాలీవుడ్ లో బాలయ్యబాబు దారే వేరు. దీపావళి రోజు హైదరాబాద్ లోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్ వద్ద ఆయన హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన ఫొటోలు వైరల్ అవుతుంటే ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అంతేకాదు ఆయన అక్కడ ఓ అంబులెన్స్ నడిపి చేసిన సందడి అంతాఇంతాకాదు. ఇంతకీ అక్కడ నందమూరి బాలకృష్ణ అంబులెన్స్ ఎందుకు నడపాల్సి వచ్చిందో చూద్దాం.
ఆ ఆస్పత్రికి ఓ మినీ బస్సును జేవీ భానుమూర్తి తన భార్య సత్యవాణి జ్ఞాపకార్థంగా విరాళంగా ఇచ్చారు. దాన్ని బసవరామ తారకం అస్పత్రికి అంబులెన్స్ గా నడపాలని నిర్ణయం తీసుకున్నారు. భానుమూర్తి ఆ బస్సుతాళాలను తన చేతుల మీదుగా బాలకృష్ణకు అందజేశారు. దాన్ని ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ ఆ బస్సును ఆస్పత్రి ఆవరణలో నడిపారు. ఆ ఫొటోలే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అసలు సంగతి అదన్న మాట.