బాలయ్య, బోయపాటి అంటే ఉండే క్రేజే వేరు. వీరిద్దరి కలయికలో వస్తున్న‘అఖండ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం అంతకుముందు వీరి కలయికలో సింహా, లెజండ్ చిత్రాలు వచ్చాయి. మూడో చిత్రం ఈ ‘అఖండ’ వస్తోంది. తాజాగా ఈ సినిమా మొదటిపాట విడుదలైంది. ‘అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా.. జతగా జతగా.. పంచు నీ ప్రేమ పారాణిగా.. చిన్న నవ్వే రువ్వి మార్చేశావే.. నా తీరు నీ పేరుగా.. చూపు నాకే చుట్టు కట్టేశావే.. నన్నేమో సన్నాయిగా.. కదిలే కలలే.. కళ్ల వాకిళ్లలో కొత్తగా.. కౌగిలే ఓ సగం.. పొలమారిందిలే వింతగా’ అనే పల్లవితో సాగే ఈ పాటను ఈరోజు సాయంత్రం విడుదల చేశారు.
ఎస్.ఎస్. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. కళ్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను ఎస్పీ చరణ్, ఎం.ఎల్ శ్రుతి పాడారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిరియాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఫీల్ గుడ్ మెలోడీగా ఈ పాట ఉంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. జగపతిబాబు, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. బహుశా వీరిద్దరినీ విలన్లుగా చూపిస్తారేమో చూడాలి. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్ వర్క్ ప్రారంభమైందనే అనుకోవాలి. పక్కా మాస్ మసాలా అంశాలతో ఈ సినిమా ఉండబోతుందన్నది స్పష్టమవుతోంది.