సజ్జల రామకృష్ణా రెడ్డి.. సకల శాఖా మంత్రి.. ప్రతిపక్ష నేతలు ఆయనకు ఇచ్చిన బిరుదు.. సొంత పార్టీ వైసీపీ నేతల్లో ఆయన నెంబర్ టూ.. జగన్ తర్వాత జగన్ అంతటి వాడు… పార్టీలో తిరుగులేని పట్టు సాధించిన నేత సజ్జల.. గత నాలుగేళ్లుగా జగన్ తోపాటు పార్టీ వాయిస్ గా ఆయననే భావిస్తున్నారు.. సజ్జలని పల్లెత్తు మాట అనడానికి వైసీపీ నేతలు భయపడతారు. ఆయనపై చిన్న కామెంట్ చేయాలన్నా వణికిపోతారు.. అక్కడ ఆయన పవర్ అలాంటిది.. అలాంటి నేతపై తొలిసారి మంత్రి బొత్స ఫైర్ అయ్యారు.. అసంతృప్తి వ్యక్తం చేశాడు.. ఇదే ఇప్పుడు వైసీపీ అంతర్గత సమావేశాలలో హాట్ టాపిక్ గా మారుతోంది..
ఇటీవల సజ్జల ఓ ప్రెస్ మీట్ లో .. చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయం అని విమర్శించారు. ఏపీ ఫైబర్ నెట్ అవినీతి స్కామ్ లో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారని, ఆయన త్వరలోనే జైలు వెళతారని ఆరోపించారు సజ్జల.. ఇటీవల ఓ వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుని అరెస్ట్ చేశారు పోలీసులు.. రిమాండ్ లో ఉన్న ఆయనని పరామర్శించడానికి జైలుకు వెళ్లి వచ్చారు చంద్రబాబు.. ఈ సందర్భంలో సజ్జల… పరామర్శకే కాదు, నిందితుడిగా చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం అన్నారు..
చంద్రబాబుని జైలుకి పంపుతామనడం సరికాదని సజ్జలకి బొత్స హితవు పలికారు.. ఎలాంటి చిన్న అవకాశాన్ని అయినా చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోగల రాజకీయ మేధావి అని, జైలుకు పంపుతామంటే అది తనకు అడ్వాంటేజ్ గా మార్చకొని సానుభూతి రాజకీయంగా మార్చుకోగలడని బొత్స అభిప్రాయ పడ్డారు. ఎన్నికలకు ఏడాది ముందు సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం మంచిది కాదని, ప్రత్యర్ధికి మనం అస్త్రాలను ఇచ్చినట్లు అవుతుందని బొత్స సూచించారు..
బొత్స కామెంట్స్ వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.. సజ్జలపై చిన్న వ్యాఖ్య చేయడానికి భయపడతారు ఆ పార్టీ నేతలు.. అలాంటిది సజ్జలకి హితవు పలికినట్లు, ఆయన చేసింది తప్పు అని కామెంట్ చేయడం వెనుక ఏం జరిగిందని ఆరా తీస్తున్నారు వైసీపీ నేతలు.. పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని, పద్ధతి మార్చుకోవాలని హై కమాండ్ నేతలకు సూచించినా ఎలాంటి మార్పు లేకపోవడంతో తాజాగా బొత్స లాంటి నేతలు అసహనం, అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడం, గ్రౌండ్ లెవల్ లో ప్రభుత్వంపై భారీ వ్యతిరేకత ఉందనే కథనాలతో బొత్స లాంటి సీనియర్ నేతలు తిరుగుబాటుకి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది.. మరి, రాబోయే రోజుల్లో ఇది ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.