రోజాకి కొడాలి బాధ్యతలు..??
ఫైర్ బ్రాండ్.. మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఏమైంది? ఎప్పుడు చుసిన ఏదో ఒక విధంగా ప్రతిపక్షాల మీద మాటల దాడి చేసే కొడాలి నాని ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అయితే కొడాలి నాని సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటి? కొడాలి నాని మౌనంగా ఉండటానికి రాజకీయ వ్యూహాత్మకమేనా? లేదంటే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అని మాత్రం తెలియరాలేదు. సాధారణంగా సీఎం జగన్ ని ఎవరైనా ఒక్క మాట అంటే చాలు మాటల యుద్దానికి దిగేవాడు. ప్రెస్ మీట్లు పెట్టి బూతుపురాణం అందుకునే వాడు, అలాంటి కొడాలి నాని ఉన్నటుండి ఇలా మౌనంగా ఉండటానికి ఎదో కారణం ఉండే ఉంటుంది అని రాజకీయ పండితులు అంటున్నారు.
ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ఎమ్మెల్యేలు , మంత్రులలో బాగా నమక్కమైన వాడు, ఎవరైనా ఉన్నారు అంటే అది కొడాలి నాని అని అంటారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి ఒక సమయం, అప్పోయింట్మెంట్ కూడా అవసరం లేకుండ, తనకి ఇష్టం వచినప్పుడు వెళ్లి జగన్ ని కలిసేవాడు నాని. అలాంటిది సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలిచినా కూడా కొడాలి నాని వెళ్లలేదని సమాచారం. జగన్ పిలిచినా నాని ఎందుకు వెళ్ళలేదు? అని వైసీపీ నాయకులలోనే రచ్చ రచ్చ అవుతోంది.
అసలు ఎందుకు కొడాలి నాని ఇంత మౌనంగా ఉంటున్నాడు అని వైసీపీ వర్గాల్లోనే తెగ చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఎప్పుడు కూడా అయినదానికీ, కానీ దానికి నోరు పారేసుకునే కొడాలి నాని, మౌనానికి అర్ధం మేమిటో వైసీపీ నాయకులు కూడా తెలియడం లేదు అంటున్నారు.
కోడలి నాని మౌనానికి గల కారణాలు తెలిస్తే ప్రతి ఒక్కరు నివ్వెరపోతారు. రాజకీయంగానే కోడలి నాని మౌన వ్రతం పాటిస్తున్నారు అని తెలుస్తోంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ ని, కాపు సామజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడటం వల్ల, ఆ సామజిక వర్గం వాళ్ళు కొడాలి నాని మీద, అలాగే వైసీపీ మీద గుర్రగా ఉన్నారని తెలుసుకున్న సీఎం జగన్, కొడాలి నానికి వార్నింగ్ కూడా ఇచ్చాడని సమాచారం.కొడాలి నాని ఫైర్ బ్రాండ్ గా కంటిన్యూ చేస్తే అది వైసీపీ కి పెద్ద మైనస్ అవుతుందని గ్రహించిన సీఎం, కొడాలి నానిని , ఇక నుండి మౌనంగా ఉండాలని సూచించాడని తెలుస్తోంది. ఓట్ బ్యాంకు కోసమే కొడాలి నాని మౌనం పాటిస్తున్నారు అని కొట్టొచిన్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో రోజా కూడా సీఎం జగన్ మన్ననలు పొంది అత్యత నమ్మకమైన వ్యక్తిని అని సీఎం దగ్గర అనిపించుకోవాలని, ప్రతి పక్షం మీద మాటల దాడి చేస్తోంది.
అయితే ఎలక్షన్ సమయం దగ్గరపడుతుండటంతో ప్త్రాతిపక్షాలని తిట్టే బాధ్యతని మినిస్టర్ ఆర్కే రోజానే తీసుకున్నారు తెలుస్తోంది.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్, కొడాలి నాని వల్ల బాగా డిస్స్పాయింట్ అయినట్టు తెలుస్తోంది. ఇక నుండి ప్రతిపక్షాల మీద రోజా మాటల దాడి మొదలవబోతోందని సమాచారం. జగనన్న దీవెనలు అందుకోవడం కోసం ఏమైనా చేస్తాను అని వైసీపీ నాయకులతోనే రోజా సవాల్ చేసిందని వినికిడి..