మంగళగిరిలో వైసీపీకి భారీ షాక్…!!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రోజురోజుకి ప్రభంజనం సృష్టిస్తోంది. నారా లోకేష్ ఏ గ్రామంలో అడుగు పెట్టిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ లోకేష్ కి స్వాగతం పలుకుతున్నారు.
నారా లోకేష్ యువగలం పాదయాత్ర రాయలసీమ నుండి ఇప్పుడు ఆంధ్రాలోకి ప్రవేశించాడు. ఈ మద్యే నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాడు. అయితే నారా లోకేష్ పాదయాత్ర మంగళగిరి నియోజక వర్గంలోకి ఇలా అడుగు పెట్టాడో లేదు అప్పుడే వైసీపీ శ్రేణులు తండోపతండాలుగా వచ్చి టీడీపీలో చేరుతున్నారు. పలు వైసీపీ నాయకులు నారా లోకేష్ సమక్షంలో పచ్చ కండువా కప్పుకొని మా మద్దతు టీడీపీకే అని లోకేష్ సాక్షిగా మాటఇచారు.
వైసీపీ నాయకులందరూ కట్టకట్టుకుని టీడీపీలో చేరడంతో అధిక పార్టీ వైసీపీ నేతలకి కంటిమీద కునుకులేకుండా పోతోంది. మంగళగిరి శివారు ప్రాంతమైన నిడమర్రు విశ్రాంత కేంద్రంలో వివిధ గ్రామాల నేతలు లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్తం పుచ్చుకున్నారు. లోకేష్ టీడీపీ పార్టీ ఇంఛార్జిగా ఉన్న మంగళగిరి నియోజక వర్గం నుండి 500 కుటుంబాలకి పైగా టీడీపీలో చేరడం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది.
టీడీపీలో చేరిన వారందరు కూడా ఆళ్ల రామకృష్ణ రెడ్డికి ముఖ్య అనుచరులు, పైగా అదే సామజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడం గమనార్హం. ఆళ్లరామకృష్ణ రెడ్డి సొంత ప్రయోజనాలకోసమే మమల్ని బలిపశువులను చేసాడని వాళ్ళు వాపోతున్నారు. లోకేష్ పాదయాత్రలో కొత్తగా చేరినవారు క్రియాశీలకంగా వ్యవహరించడం ముఖ్యముగా చెప్పుకోవాలి. వైసీపీని వదిలి టీడీపీలో చేరినవారిలో నిడమర్రు గ్రామానికి చెందిన గాదె లక్ష్మ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, సుంకర రఘుపతి రావు, చినకాకాని మాజీ ఎంపీ టిసి కుకుమళ్ళ శ్రీనివాసరావు, పేదవడ్లముడికి చెందిన నాగళ్ళ శ్రీధర్ తదితరులు టీడీపీలో జాయిన్ అయ్యారు..