చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకోవాలని భావిస్తున్న మంత్రి రోజాకి ఈసారి ఊహించని ఝలక్ తగలనుందనే ప్రచారం జరుగుతోంది.. వరసగా రెండుసార్లు ఎమ్ఎల్ఏగా గెలిచిన రోజా హ్యాట్రిక్ అందుకోవాలని ఉబలాటపడుతున్నారు.. ఈసారి ఆమె ఆశలు అడియాసలు అవ్వడం ఖాయమని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు..
రోజాకి చెక్ పెట్టాలని సొంత పార్టీ నేతలే విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె వైసీపీ అధినేత జగన్ దగ్గరే ప్రస్తావించి కన్నీటిపర్యంతం అయ్యారని సొంత పార్టీ నేతలే చెబుతారు.. వైసీపీలో కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రోజాని ఓడించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనే ఆ పార్టీ నేతల్లోనే చర్చ జరుగుతోంది.. నగరి నియోజకవర్గంలో కొంతమంది మండల, గ్రామ స్థాయి నేతలని రోజాపై ప్రయోగించి ఆమెపైనే ఎటాక్ చేయించారు కొందరు.. ఇది ఆమెకి ఊహించని షాక్.. చివరికి, రోజా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులకు ఆమెకు ఆహ్వానం లేకుండా ప్రారంభాలు జరిగిపోయాయి.. అంటే, రోజాకి వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఊహించవచ్చు..
ఇవన్నీ ఒక ఎత్తయితే, తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై రోజా కాస్త పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.. ఇది ఆయన అభిమానుల మనసులను తీవ్రంగా గాయపరిచిందనే చర్చ సాగుతోంది.. ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు వచ్చిన రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు.. ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దారని కీర్తించారు.. ఇటు, మరోసారి ఏపీలో ఆయన విజయం సాధిస్తే దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని అభిప్రాయపడ్డారు..
రజనీ వ్యాఖ్యలు వైసీపీలో పెను ప్రకంపనలు రేపాయి.. ఏపీలోని ప్రస్తుత రాజకీయ స్థితికి దర్పణం పట్టాయి.. జగన్ పాలనలో ఏపీ ఎంతటి అధ్వాన్నంగా తయారయిందో ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనే చర్చ మొదలయింది. దీనికితోడు, చంద్రబాబు మార్క్ బ్రాండ్ ఇమేజ్ ని ఆయన జాకీలేసి మరీ లేపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. చంద్రబాబు ఇమేజ్ ని రజనీకాంత్ హీరోల రేంజ్ ఎలివేషన్ ఇచ్చి, భారీ ఆర్ ఆర్ మ్యూజిక్ వేసి మరీ హైలైట్ చేశారని చెబుతున్నారు.. సహజంగానే ఇది నచ్చని వైసీపీ.. రజనీకాంత్ ని టార్గెట్ చేసింది..
పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు లాంటి నేతలు రజనీకాంత్ ని టార్గెట్ చేసినా, బూతులతో విరుచుకుపడినా ఎలాంటి డ్యామేజ్ జరగదు. కానీ, రోజా పరిస్థితి పూర్తి భిన్నం.. ఆమె నియోజకవర్గంలో తమిళ ఓటర్లు గణనీయంగా ఉంటారు. రోజా భర్త సెల్వమణిది తమిళనాడు కావడంతో .. తమిళ ఓటర్లు ఆమెకే గంపగుత్తగా ఓట్లు వేస్తున్నారట.. తాజాగా రజనీకాంత్ ని రోజా తీవ్రంగా దూషించడంతో.. ఈ ప్రభావం పడడం ఖాయమని భావిస్తున్నారు ఎనలిస్టులు.. రజనీకాంత్ ని డెమీ గాడ్ గా భావించే ఆయన అభిమానులకి రోజా కామెంట్స్ మింగుడు పడడం లేదు.. దీంతో, ఆమెకు ఈ దఫా చుక్కలు చూపించడం గ్యారంటీ అని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.. మరి, ఇదే నిజం అయితే నగరిలో గరం గరంగా ఉన్న తమిళ ఓటర్లు…. ఆమెని ఓడించడం ఖాయంగా కనిపిస్తోంది.. మరి, ఏం జరుగుతుందో చూడాలి..