కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి ఆయన స్నేహితుడు, టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు స్నేహద్రోహం చేశారా..?? రజనీకాంత్ ని వైసీపీ నేతలు వ్యక్తిగతంగా విమర్శిస్తుంటే ఆయన కనీసం నోరు ఎందుకు మెదపలేక పోయారు..? ఇది స్నేహితుడికి హ్యాండ్ ఇవ్వడం కాదా.?? అని నిలదీస్తున్నారు రజనీకాంత్ అభిమానులు..
ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలకు హాజరయిన సూపర్ స్టార్ రజనీకాంత్.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు.. ఆయన విజన్ అద్భుతం అని, ఆయన ఒక బ్రాండ్ అని కీర్తించారు.. ఇది వైసీపీకి కడుపుమంటగా తయారయింది. దీనిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ ని విమర్శించకపోయినా పర్లేదు.. తమ ప్రత్యర్ధి చంద్రబాబుని కీర్తించడం వారికి నచ్చలేదు.. అంతే, వైసీపీ నేతలు తమ నిజస్వరూపం బయటపెట్టేశారు.. రజనీకాంత్ ని ఏక వచనంతో సంబోధిస్తూ విరుచుకుపడ్డారు… ప్రపంచంలోనే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోపై తీవ్ర పదజాలంతో అక్కసు వెళ్లగక్కారు.. రజనీకాంత్ ది చీకిపోయిన తాటికాయ బొచ్చులాంటి ముఖం అని కామెంట్ చేశారు..
ఇక, రజనీకాంత్ స్టామినా ఏంటో తెలిసిన ఆ పార్టీకి చెందిన సినీ నటులు సైతం.. రజనీకాంత్.. కోలీవుడ్ సూపర్ స్టార్ అని, తెలుగులో కాదని వితండవాదం మొదలుపెట్టారు.. ఇది అంతా ఓకే.. కానీ, తన స్నేహితుడు, ఆప్తమిత్రుడు రజనీకాంత్ పై గత ఎన్నికలలో తాను మద్దతు ఇచ్చిన వైసీపీకే చెందిన నేతలు పర్సనల్ ఎటాక్ చేస్తున్నా.. ఆయనపై వినడానికి కంపరం కొట్టే కామెంట్స్ తో విరుచుకుపడుతున్నా.. రజనీ క్లోజ్ ఫ్రెండ్ మోహన్ బాబు సైలెంట్ గా ఉండడం ఆశ్చర్యంగా ఉందని తలైవా ఫ్యాన్స్ మండిపడుతున్నారు..
మోహన్ బాబు కష్టాలలో ఉన్న సమయంలో ఆదుకున్న మిత్రుడు మోహన్ బాబు.. గతంలో ఆయన ఆర్ధికంగా, నైతికంగా ఎంతో అండగా నిలిచారని స్వయంగా మోహన్ బాబే చెప్పుకున్నారు. పూర్తిగా అప్పులలో కూరుకుపోయి, ఆర్ధికంగా చితికిపోయిన మోహన్ బాబుతో తమిళ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన పెదరాయుడు సినిమా రీమేక్ హక్కులు కొనిపించారు రజనీకాంత్. ఆ టైమ్లో మోహన్ బాబు దగ్గర మనీ లేకపోవడంతో స్వయంగా రజనీకాంత్ ఆ హక్కులని కొని తన ఫ్రెండ్ కి ఇచ్చారు.. అంతేకాదు, ఆయనే ఓ కీలక పాత్ర పోషించారు.. ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో రజనీకాంత్.. మోహన్ బాబుకి అండగా నిలిచారు..
అయితే, జగన్ తో బంధుత్వం కలిగిన మోహన్ బాబు.. తన స్నేహితుడికి అన్యాయం చేస్తున్నాడనే చర్చ జరుగుతోంది.. మోహన్ బాబు పెద్ద తనయుడు మంచు విష్ణు భార్య.. జగన్ బాబాయ్ కూతురు.. దీంతో, ఫ్యామిలీలో విబేధాలు వస్తాయనే ఆలోచనతోనే ఆయన తన స్నేహితుడికి నమ్మక ద్రోహం చేశారని విశ్లేషకులు మండిపడుతున్నారు.. మొత్తమ్మీద, అల్లుడు వరసయ్యే జగన్ కోసం, బంధుత్వం కోసం స్నేహితుడిని దూరం చేసుకున్నాడనే చర్చ సాగుతోంది.. మరి, ఇప్పటికయినా మోహన్ బాబు బయటకి వస్తారా..? రజనీకాంత్ కి అండగా ఉంటారా..? అనేది చూడాలి..