ఉప్పెన సినిమా మాదిరిగా సాగిన లవ్ స్టోరీ..!
ఢిల్లీకి చెందిన ఓ యువతి, యువకుడు(22) ఒకనొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఇంట్లో నుంచి వెళ్లి, ఢిల్లీకి బయటకు పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు యువకుడిపై కక్ష్య పెంచుకున్నారు. పెళ్లి తరువాత ఆ జంట డిసెంబర్ 22 న తిరిగి ఢిల్లీకి చెరుకున్నారు. ముందస్తు జాగ్రత్త కోసం యువతి కుటుంబ సభ్యులు నుంచి తమకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని రాజౌరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు ఇంకా కోపం పెంచుకున్నారు.
ప్రేమ ఇలా విషాదాంతం ..!
ప్రేమించుకున్న యువతి, యువకుడు రాజౌరీ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 22న ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి అలా బయటకొచ్చారో లేదో .. యువతి కుటుంబ సభ్యులు రాజౌరీ గార్డెన్ వద్ద జంటపై దాడిచేసి కిడ్నాప్ చేశారు. తీవ్రంగా గాయపరిచి, అతడి మార్మాంగాన్ని కోసేశారు. యువకుడి పరిస్థితి విషయంగా ఉండటంతో స్థానికులు సఫార్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అచ్చం ‘ఉప్పెన’ సినిమాలో తనకు నచ్చని వ్యక్తిని కూతురు ప్రేమించిందని తండ్రి.. హీరో మార్మాంగాన్ని ఎలగైతే కోసేస్తాడో అలానే ఢిల్లీ ఘటనలో నిజ జీవితంలో జరిగింది. అది దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డన ఇటువంటి దారుణ ఘటన వెలుగు చూడటంతో యావత్తు దేశం నిర్ఘాంతపోతోంది. యువకుడి విషయంలో ఇంత ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని యువకుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.