భారత్ బంద్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దుతివ్వడమే కాదు అందులో నేరుగా పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమాలు పలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఓ చిరు వ్యాపారి షాపుపై కొందరు దాడి చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ డి.అరవింద్.. టీఆర్ఎస్ ప్రభుత్వం పోషిస్తున్న గుండాయిజమని ఆరోపించారు. బంద్ పాటించనందుకు చిన్న చిన్న వ్యాపారుల దుకాణాలను దగ్గరుండి మరీ ధ్వంసం చేస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో ఆరోపించారు. అయితే వీడియోలో షాపుపై కొందరు దాడి చేస్తున్న ఘటన యాదగిరిగుట్టలో జరిగినట్లు సమాచారం. కొందరు నిరసన కారులు షాపును మూసివేయాలంటూ షాపు యజమానితో వాగ్వాదానికి దిగుతున్నట్లు ఆ వీడియోలో తెలుస్తోంది. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించడం జరిగింది.
https://www.facebook.com/franklyarvind/videos/4760133127394389/
ఎమ్మెల్యే దౌర్జన్యం…
భారత్ బంద్‌కు మద్దతులో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర భాగ్యనగర్ బస్ స్టాప్ వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రాస్తారోఖోలో పాల్గొన్నారు. రాస్తారోఖోపై ప్రశ్నించిన ఓ వ్యక్తిని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్యకర్తలు నెట్టేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే ధర్నాపై నగర జనం కొందరు తిరగబడ్డారు. అసులు ఎందుకీ ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు ఇప్పుడే కపడ్డాయా? అని ఓ మహిళ ప్రశ్నించింది. ఇలా బారికేడ్లు వేసి జనాన్ని ఇబ్బందులకు గురిచేయడమేంటని నిలదీసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Must Read ;- బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?