గ్రేటర్ ఫలితాలు ఉత్కంఠకు రేపుతున్నాయి. పాతబస్తీ మినహా నువ్వా నేనా అన్నట్లుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటి వరకు 71 స్థానాల్లో టీఆర్ఎస్, 35 స్థానాల్లో బీజేపీ, ఎంఐఎం 40, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అయితే మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో అత్యధిక స్థానాల్లో ఆధిక్యం కనబరిచిన బీజేపీ ఆ తరువాత తొలి ఫలితం వెలువడే సరికి టీఆర్ఎస్ ముందంజలో దూసుకుపోతోంది. తొలి రౌండ్ ఫలితాల్లో మెజార్టీ స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. క్రమంగా ఓల్డ్‌సిటీలో ఎంఐఎం తన హవాను కొనసాగిస్తుంది. గ్రేటర్ శివారులో మాత్రం బీజేపీ జోరు పెంచింది. కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి విజయంను మెహిదీపట్నంలో ఎంఐఎం నమోదు చేసింది. రెండవ విజయాన్ని టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. చైతన్యపురిలో బీజేపీ గెలుపుతో తొలి విజయాన్ని దక్కించుకుంది.
గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 150 డివిజన్లకు బీజేపీ 149 చోట్ల బరిలో నిలిస్తే టీఆర్ఎస్150 , కాంగ్రెస్ 146 స్థానాల్లో పోటీ చేశాయి. అలాగే టీడీపీ సైతం కూడా ఈ ఎన్నికల్లో 106 స్థానాల్లో పోటీచేసింది. ముఖ్యంగా సెటిలర్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు, టీడీపీ ఓట్లను లెక్కలోకి తీసుకుని తమ సత్తా చాటాలని ఎన్నికల్లో పోటీ చేసింది టీడీపీ. సెటిలర్స్ అత్యధికంగా ఉన్న కూకట్‌పల్లిలో ఆ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. సెటిలర్లు తమవైపే ఉంటారనుకున్న టీడీపీకి ఓటర్లు గట్టి షాకిచ్చారు. టీడీపీకి కాదని కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ పార్టీకే ఆంధ్ర సెటిలర్లు పట్టంకట్టారు. కూకట్‌పల్లి డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ విజయం సాధించారు.
Must Read ;- గ్రేటర్‌లో ఎవరికి గెలుపు వరించేను?.. ఆందోళనలో పార్టీ నేతలు!











