దేశంలో వైసీపీ అతిపెద్ద దోపిడి రాజకీయ పార్టీ. ఈ విషయాన్ని సాక్ష్యాత్ సొంత పార్టీకి చెందిన వ్యక్తులే సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రోల్ చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
గడిచిన దశాబ్ధకాలంగా జగన్ రెడ్డి కోసం సర్వం దారపోసి.., రోడ్డుపడ్డ ఎమ్మెల్యేలు, ఎంపీ లకు జగన్ పార్టీ నేడు వరుసగా షాకులిస్తోంది. బంధువులు, చుట్టాలు.., అనుచర గణం అంటూ ఏమీ తేడా లేకుండా కప్పం కడితేనే.. వచ్చే ఎన్నికల్లో సీటిస్తామని తెగేసి చెప్పడం ఆ వర్గాలలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్న పరిస్ధితి. జగన్ మొండి వైఖరితో దశాబ్ధకాలంగా విసిగిపోయి.., ఇక మీదట ఈ సైకోయిజాన్ని భరించలేం అని ఒక్కొక్కరిగా దూరంగా జరిగిపోతున్న ఘటనలు చూస్తునే ఉన్నాం.
ఎమ్మెల్యే సీటుకు 40 కోట్లు.., ఎంపీ సీటు కావలంటే 120 కోట్లు పార్టీ ఫండ్ కింద కప్పం కట్టలని హుకూం జారీ చేశారు జగన్ రెడ్డి అండ్ కో. వాటి బాధ్యతలను తాడేపల్లి జీతగాడికి.., మరో కట్టుబానిస ఐఏఎస్ కు అప్పగించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్లకైనా.., తనకోసం ఎమ్మెల్యే పదవి సైతం త్యాగం చేసి.., ఆస్తులను పోగట్టుకున్న వ్యక్తులకైనా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే పార్టీ ఫండ్ రూపంలో కప్పం కట్టాలని హుకూం జారీ చేయడం జగన్ రెడ్డి కపట రాజకీయాలు ఆ పార్టీ నాయకులకు కళ్లకు కట్టింది. దీంతో జగన్ రెడ్డి చర్యలు తాళ్ళలేక ఎమ్మెల్యేలు,ఎంపీలు,ఎమ్మెల్సీలు ఆయనకు దూరంగా జరుగుతున్నారు.
మొత్తంగా జగన్ రెడ్డి పార్టీకి.., ఆయన ప్రభుత్వానికి పెద్ద నమస్కారం పెట్టి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పక్కపార్టీల వైపు చూస్తున్నది వాస్తవం. పార్టీ నుంచి బయటకు వచ్చినవారు సోషల్ మీడియాలో జగన్ రెడ్డిపై, ఆయన పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చంటి బాబు, ఎంఎస్ బాబు, ఎమ్మెల్సీలు వంశీ, సి. రామచంద్రయ్య, ఎంపీ మాధవ్ తదితరులు జగన్ రెడ్డి విధానాలను వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళే. ఇంకా ఈ జాబితాలో మరింత మంది అసంతృప్తివాదులు చేరే అవకాశం లేకపోలేదని అందివస్తున్న వార్తల సారాంశం.











