కష్టకాలంలో ధైర్యం, విపత్తులో చేయూత, ఆపదలో సాయం.. ఇదే నాయకుడి లక్షణం. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం.. ఎంతోమంది పేదవాళ్లు ప్రాణాలు కోల్పోతుండటంతో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తనవంతుగా సాయం చేయనున్నారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు సొంత ఖర్చులతో హాస్పిటల్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల కోసం బొల్లారంలో 50 పడకల ఆసుపత్రిని త్వరలోనే ప్రారంభించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఆస్పత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఆక్సీజన్ వ్యవస్థతో సహా ఇతర అన్నీ మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు. కార్పొరేట్ స్థాయిలో పేదలకు ఉచిత వైద్యం అందించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ విపత్తు సమయంలో ఎంత ఎక్కువ మందికి మేలు చేయగలిగితే నాకు అంత తృప్తి అని ఆయన అన్నారు.
వాలంటీర్లు వద్దు.. లెంపలేసుకున్న వైసీపీ అధినేత.. జగన్ పీచే ముఢ్..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్కు జ్ఞానోదయం...