గడిచిన 21 గంటల వ్యవధిలోనే ఎంజీఎంలో కరోనాతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఆరోగ్య పరిస్థితి విషమించి వారందరినీ ఎంజీఎంకు తరలిస్తుండటంతో బెడ్లన్నీ నిండిపోతున్నాయి. చాలామంది ఆరోగ్యం విషమంగా ఉంది. డాక్టర్లు, సరైన సదుపాయాలు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. దీంతోపాటు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురు మండలం గుండంరాజుపల్లిలో కరోనాతో ఇద్దరు వ్యక్తు లు చనిపోయారు. దీంతో ఆ గ్రామంలో పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. మారుమూల గ్రామాలు, పల్లెల్లోనూ కేసులు వెలుగులోకి వస్తుండటంతో వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్ తర్వాత అత్యధిక కరోనా కేసులు, మరణాలు వరంగల్ జిల్లాలో నమోదవుతుండం ఆందోళన కలిగిస్తోంది.
Must Read ;- రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం











