దేశంలో ఎక్కడైనా ఈ పద్ధతిని పాటిస్తారు. కానీ ముంబైకి చెందిన శార్ధుల్ కదమ్ యువకుడు మాత్రం చాలా డిఫరెంట్ గా ఆలోచించాడు. ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే ‘వధువుతో తాళి కట్టించుకోవడం’. పెళ్లి రోజు మూడు మూళ్లు వేసిన భార్యతోనే.. తన మెడలో తాళి కట్టించుకున్నాడు. ఇదేంటి? అని చాలామంది అడిగితే.. స్రీ, పురుషుల మధ్య సమానత్వమే పెళ్లి అని బదులు ఇచ్చాడు. తాళి కూడా ఎప్పుడు మెడలో ఉంచుకుంటానని తెగేసి చెప్పాడు. శార్దూల్ గత కొన్నేళ్లుగా తనుజ పాటిల్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఇద్దరి అభిప్రాయాలు కలువడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే భార్య మెడలో మంగళసూత్రం కట్టినట్లు.. ఆమె తన మెడలో కూడా తాళి కట్టించుకోవాలని అనుకున్నాడు. ఇదే విషయం బంధువులకు చెబితే.. ‘ఇది కుదరని పని’ అన్నారు.
శార్ధూల్ ఇతరుల మాట లెక్కచేయకుండా భార్యతో తాళి కట్టించుకున్నాడు. ఈ విషయం బాగా సంచలనమైంది. ‘వధువుతో తాళి కట్టించుకున్న వరుడు’ అనే న్యూస్ వైరల్ కావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. శార్దుల్ నిర్ణయంపై చాలామంది నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. చీర కూడా కట్టుకో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శార్దూల్ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తే, మరికొందరు స్వాగతిస్తున్నారు. కొంతమంది స్రీవాదులయితే.. శార్దుల్ లాగే, అందరూ ఆలోచించాలని అభిప్రాయపడుతున్నారు.











