ఐపీఎల్లో మ్యాజిక్ చేయడంలో ముంబయిది ప్రత్యేక స్థానం. అటువంటి మ్యాజిక్ షో మరోసారి చూపించింది రోహిత్ టీం. కోల్కతా గెలుస్తుందని అందరూ భావించిన వేళ.. అందరి అంచనాలకు తలకిందులు చేసింది. టీ20లో అత్యల్ప స్కోరు చేసి విక్టరీ చేసిన జాబితాలో ముంబయి మరో రికార్డును రాసేసుకుంది. కోల్కతాతో జరిగిన రెండో టీ20లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 10 పరుగుల తేడాతో విక్టరీ కొట్టేసింది.
సూర్య హాఫ్ సెంచరీ..
టాస్ ఓడిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్కు దిగాల్సి వచ్చింది. 19.5 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రసెల్ కేవలం రెండు ఓవర్లే వేసి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఫలితంగా ముంబయి అతి తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 56 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 32 బంతుల్లో 43 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో రసెల్ మూడు వికెట్లు తీయడంతో ముంబయి 152 పరుగులకే పరిమితమైంది.
Must Read ;- ధావన్, షా ఆల్ టైమ్ షో… చెన్నైపై దిల్లీ గెలుపు











