ఐపీఎల్ పండుగ షురూ అయ్యింది. తొలిపోరే ఉత్కంఠ భరితంగా సాగింది. ఐపీఎల్‌లో ఆలై టైమ్ ఫావరెట్ ముంబయిపై బెంగుళూరు గుర్తుండి పోయే విక్టరీని నమోదు చేసింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్‌లో చివరికి ఆర్సీబీనే విజయం వరించింది. ఐపీఎల్ 14వ సీజన్‌లో బెంగుళూరు తొలి విజయాన్ని నమోదు చేసుకోగా… ముంబయి తొలి అపజయాన్ని మూటగట్టుకుంది.
ఆఖరి బంతికి విజయం..
ఐపీఎల్ తొలిపోరులో ముంబయి ఇండియన్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. ముంబయి నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి ఛేదించింది. డివిలియర్స్ 27 బంతుల్లో 48 పరుగులు, గ్లెన్ మాక్స్ వెల్ 28 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లో డివిలియర్స్ రనౌట్‌గా వెనుదిరగడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఆద్యంతం నెలకొంది. ఈ సమయంలో చివరికి రెండు బంతులకు రెండు పరుగుల అవసరమయ్యాయి. హర్షల్ పటేల్ బెంగుళూరుకు విక్టరీని సాధించి పెట్టాడు.
హర్షల్ పటేల్ ఐదు వికెట్లు..
తొలుత టాస్ ఓడిన ముంబయి బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హర్షల్ పటేల్ బంతితో చెలరేగిపోయాడు. బ్యాట్స్ మెన్‌ను ఆద్యంతం వణికించేశాడు. 5 వికెట్లు తీసి ముంబయి పరుగులకు అడ్డుకట్ట వేశాడు. ఆఖరి ఓవర్లో హర్షల్ నాలుగు వికెట్లు తీసి ఒకే పరుగు ఇవ్వడంతో ముంబయి ఇన్నింగ్స్‌కు తెర పడింది.
Must Read ;- ఐపీఎల్‌లో ఏఏ జట్టుకు ఎవరెవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా..?











