తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం అలిపిరి వద్ద బైఠాయించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన కుటుంబానికి ప్రమేయం లేదని ప్రమాణం చేయడానికి అలిపిరి వద్దకు చేరుకున్నారు. తాను ఇక్కడ ఉన్నానని, మరి వైఎస్ జగన్ ఎక్కడా అని ప్రశ్నించారు. తన సవాలును స్వీకరించి ముఖ్యమంత్రి జగన్ అలిపిరికి వస్తారా? అని ఎదురు చూస్తున్నట్టు మీడియాకు తెలిపారు. రక్త చరిత్ర ఉన్న కుటుంబం మాది కాదు అని, వైఎస్ జగన్ దేని అన్నారు. ఇటు నేను ఉంటా, అటు జగన్ రెడ్డి ఉంటాడా? అన్నారు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తన సవాల్ స్వీకరించాలని, లేదంటే బాబాయి హత్య కేసును చేధించాలన్నారు. జగన్ తీరును నిరసిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తుల పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. చేతగాని సీఎం, తప్పుకోవాలంటూ లాంటి నినాదాలతో అలిపిరి మారుమోగుతోంది.
Must Read ;- రక్త చరిత్ర మాది కాదు.. వివేకా హత్యపై వెంకన్నసాక్షిగా లోకేష్ ప్రమాణం










