వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మ*ర్డర్ మిస్టరీ ఇప్పటివరకూ తేలలేదు. ఐతే ఈ కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వాచ్‌మెన్ రంగన్న మృ*తితో ఈ అంశంపై మరోసారి చర్చ జరుగుతోంది. 2019 మార్చిలో వైఎస్ వివేకా హ*త్య జరిగింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ హయాంలో వివేకా కేసులో కీలకంగా ఉన్న నలుగురు అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటివరకూ చనిపోయిన ఆరుగురివి సహజ మర*ణాలేనని, అనారోగ్య కారణాలతో చని*పోయారని పైకి కనిపిస్తున్నప్పటికీ..అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ఒకే తరహాలో చనిపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది. కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ప్రధాన సాక్షులు, కేసుతో సంబంధమున్న వ్యక్తులు మర*ణిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్ రంగన్న తాజాగా అనుమానాస్పద స్థితిలో మృ*తి చెందటం, తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమానాలున్నాయంటూ రంగన్న కుమారుడు కాంతారావు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మర*ణాల వెనుక వివేకా హ*త్య కేసు నిందితుల కుట్ర ఉందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ మ*రణాలన్నింటిపై సమగ్ర విచారణకు రెడీ అవుతోంది.
నారాయణ యాదవ్, జగన్ వెహికిల్ డ్రైవర్, వివేకా కేసులో ప్రధాన సాక్షి. 2019 డిసెంబర్ 6న నారాయణ చనిపోయారు. వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబరులో మృ*తి చెందారు. నారాయణ యాదవ్ అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్న సమయంలో ఆయన మరణించటం అనుమానాలకు దారి తీసింది. హైదరాబాద్- పులివెందుల ప్రయాణంలో జగన్‌మోహన్‌రెడ్డి, భారతి, అవినాష్‌రెడ్డి, ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్ విన్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవకముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నారాయణ యాదవ్ మృ*తిపై పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు. అతని అంత్యక్రియలకు జగన్, భారతి హాజరయ్యారు.
వాచ్‌మన్ రంగన్న…వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఈ నెల 5న చనిపోయారు. రంగన్న వాంగ్మూలంతో వివేకా కేసు కీలక మలుపు తీసుకుంది. హ*త్య జరిగిన రోజు వివేకా నివాసం వద్ద కాపలాగా ఉన్న వాచ్‌మన్ రంగన్న ఆయన హ*త్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి ఈ హ*త్య చేసినట్లు ఆయన సీబీఐకి, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకరరెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేకా హ*త్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు. వివేకా హ*త్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న రెండు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృ*తి చెందారు. ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించగా..చికిత్స పొందుతూ చనిపోయారు. మా నాన్నకు నిరుడు కాలికి గాయమైంది. పులివెందుల నుంచి కడప, తిరుపతి, హైదరాబాద్ వరకు తీసుకెళ్లి చికిత్స చేయించాం. తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో చికిత్స వివరాలు కోరినా పోలీసులు మాకివ్వలేదు. ఆ చికిత్సపై మాకు అనుమానాలున్నాయంటూ రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపించారు.
కల్లూరి గంగాధర్‌రెడ్డి, వివేకా కేసులో కీలక సాక్షిగా ఉన్నారు. 2022 జూన్ 9న చనిపోయారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ మరణమూ అనేక సందేహాలకు తావిచ్చింది. వివేకా హ*త్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే..ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డితో కలిసి వివేకాను హ*త్య చేయించాం. ఆ నేరాన్ని నీపై వేసుకుంటే వారు రూ.10 కోట్లు ఇస్తారు. నీ జీవితాన్ని సెటిల్ చేస్తామంటూ ఈ కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనకు ఆఫర్ ఇచ్చారంటూ, దాన్ని తాను తిరస్కరించానని 2021 అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి CBIకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత మాట మార్చారు. కొన్నాళ్ల తర్వాత గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కేసులో అనుమానితుడిగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ 3న అనుమానస్పద స్థితిలో చనిపోయారు. శ్రీనివాసుల రెడ్డిది వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరు. విషపుగుళికలు సేవించి, ఆయన ఆత్మహ*త్య చేసుకున్నారంటూ విస్తృత ప్రచారం చేశారు. శ్రీనివాసులరెడ్డి వివేకా హ*త్య కేసులో అనుమానితుడు. ఈ హ*త్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి. పరమేశ్వరరెడ్డి నార్కోఎనాలసిస్ పరీక్షలకు హాజరై తిరిగొచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసులరెడ్డి మరణించారు. సీబీఐ విచారణ కంటే ముందు రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ ఈ కేసులో కీలక వ్యక్తుల్ని విచారిస్తున్న సమయంలో శ్రీనివాసులరెడ్డి చనిపోయారు. వివేకా హ*త్య కేసులో అనుమానితులను సిట్ ఇన్‌స్పెక్టర్ లోతుగా విచారిస్తున్నవేళ..దాన్ని ఆపడానికే ఇలా చేశారన్న అనుమానాలున్నాయి. శ్రీనివాసులరెడ్డి రాసినట్లుగా చెబుతున్న లేఖల్లోని చేతిరాత కూడా ఆయనది కాదన్న సందేహాలున్నాయి.శ్రీనివాసులరెడ్డి మృ*తదేహంలో కాలేయానికి, కిడ్నీ మధ్య భాగంలో రక్తం ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. పోలీసులు ఆ రక్తపు ఆనవాళ్లేమిటో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు.
వివేకా హ*త్య కేసు కీలక సాక్షుల్లో మరొకరు డాక్టర్ వైఎస్.అభిషేక్ రెడ్డి. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకరరెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్ వచ్చిందని, ఘటనాస్థలానికి వెళ్లి చూడగా..మృ*తదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యే*నని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి CBIకి వాంగ్మూలమిచ్చారు. అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకరరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డే వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు. స్వతహాగా వైద్యుడు, యువకుడైన అభిషేక్‌రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు. దీని వెనకా అనేక అనుమానాలున్నాయి.
ఈసీ గంగిరెడ్డి, వై.ఎస్.భారతి తండ్రి. వివేకా మృ*తదేహానికి కట్లు కట్టింది గంగిరెడ్డి హాస్పిటల్ సిబ్బందే. ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో అనారోగ్యంతో చనిపోయారు. వివేకా హ*త్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేకా హ*త్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి, బ్యాండేజీలు చుట్టారు. వివేకా హ*త్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో గంగిరెడ్డి మృ*తి కూడా మిస్టరీగానే మారింది.