టాలీవుడ్‌లో పరశురామ్ అనే డైరెక్టర్ పేరు వినిపిస్తే.. యువత, సోలో, ఆంజనేయులు, గీతాగోవిందం లాంటి సినిమాలు గుర్తొస్తాయి. కానీ, కొంతకాలంగా కాంట్రవర్శీలు పరుశురాం చుట్టూ తిరుగుతున్నాయి. కోరి తెచ్చుకున్నది కానప్పటికీ, సినిమా ఇండస్ట్రీలో పరుశురామ్‌కి శత్రువులు ఎక్కువయ్యారు. లేటెస్ట్‌గా యంగ్ హీరో నాగచైతన్య చేసిన కామెంట్ కొందరికి పరుశురామ్‌పై నెగెటివిటీకి బాగా కారణం అయ్యింది.
అసలు పరుశురాం, నాగచైతన్య కథ ఏంటీ? అంటారా? నాగ చైతన్యకు ఒక సినిమా చేస్తానని కథ కూడా చెప్పి ఆ సినిమా చెయ్యకుండా ఇంకొకరితో సినిమాను పరుశురామ్ తీస్తున్నాండంట.. ఓ పెద్ద స్టార్ హీరోకి కథ చెప్పి అలా చేస్తారా? తప్పు కదూ అంటూ సదరు హీరో ఫైర్ అవ్వడం.. డైరెక్ట్‌గా పరుశురామ్ మీదే హీరో సెటైర్లు వేసేశారు.. దానికి తోడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ అబద్ధపు ప్రచారాన్నిసైతం పుట్టించారు.
పరుశురాం నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని సినిమాలు చేయట్లేదని ప్రచారం మొదలెట్టేశారు. గతంలో దర్శకధీరుడు జక్కన్నకూ ఈ బాధలు తప్పలేదు. రాజమౌళి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళల్లో ఇటువంటి రూమరే వచ్చింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య…18 ఏళ్ల కిందట రాజమౌళికి అడ్వాన్సు ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఏడాది కిందట ప్రేక్షకుల ముందుకొచ్చింది.
మరో నిర్మాత కెఎల్ నారాయణ 21 ఏళ్ల కిందట సిహాంద్రి మూవీ సమయంలో రాజమౌళికి అడ్వాన్సు ఇచ్చారు. త్వరలో రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో పాన్ ఇండియా స్థాయిలో సినిమా తెరకెక్కబోతోంది. ఆ మూవీకి కెఎల్ నారాయణ నిర్మాత. నిర్మాతలు టాలెంట్ ఉన్న డైరక్టర్‌కైనా, హీరోలకైనా ముందుగా అడ్వాన్సులు ఇవ్వడం సినీ ఇండస్ట్రీలో కామన్. వారి డేట్లు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు సెట్స్‌పైకి సినిమా తీసుకెళ్తారు. అది ఐదు నెలలైనా పట్టొచ్చు ఐదేళ్లైనా అవ్వొచ్చు. అంతమాత్రాన మాఫియా మొత్తం ఏకమై పరుశురామ్‌ని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో పరుశురామ్ ఒకడు. ఆయన డేట్‌ల కోసం నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఎదురు చూస్తుంటారు. వారి డేట్‌లను బట్టి సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. చెప్పిన బడ్జెట్‌లోనే సినిమాని కంప్లీట్ చేస్తాడని లెక్కలు వేసుకుని సినిమాలు తీసే దిల్ రాజు లాంటి నిర్మాతలు సైతం పరుశురామ్‌తో సినిమాలు చేస్తున్నారు. అటువంటి నమ్మకస్తులైన డైరెక్టర్‌లకు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవడం కొత్తేం కాదు..
ఈ క్రమంలో హర్ట్ అయ్యే హీరోలూ ఉంటారు. నిర్మాతలూ ఉంటారు. కొందరు అయ్యారు. పెద్ద హీరోలు, పెద్ద క్యాస్టింగ్ ఉన్నప్పుడు వారి డేట్ల బట్టి సినిమా సెట్ పైకి వెళ్లడానికి లేట్ అవుతూ ఉంటుంది. ఈ విషయం నిర్మాతలకూ తెలుసు. పరుశురాం ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ఓ బ్యాచ్ ఎక్కువగా పనిచేయడం ఇప్పుడు ఇండస్ట్రీలోని దర్శకులకూ నచ్చట్లేదు. చూడాలి మరి ఒక దర్శకుడిని డ్యామేజ్ చెయ్యడానికి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తారో..!