దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్.. దేశంలోని ప్రతి ముఖ్యమంత్రి ఆస్తుల చిట్టాను బయటపెట్టింది అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ.. జగన్ వ్యక్తిగత ఆస్తుల విలువ 510 కోట్లు.. అవును ఇది నిజం.. జగన్ ఆస్తుల విలువ.. అయితే ఇది పేపర్ పై మాత్రమే.. మార్కెట్ విలువ దీనికి ఎన్ని రెట్లు ఉంటుందనే చర్చ సాగుతోంది.
మరోవైపు, ఆయన భార్య భారతి ఆస్తుల విలువని కూడా పరిగణనలోకి తీసుకుంటే అది ఎన్ని వేల కోట్లకు చేరుతుందో అని వైసీపీ నేతలు సైతం ఆశ్చర్యానికి లోనవుతుంటారు..
జగన్ ఆస్తుల విలువ కొన్ని వేల కోట్లు ఉంటుందని టీడీపీ నేతలు ఎప్పటినుండో ఆరోపణలు చేస్తున్నారు.. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా అధికారం దక్కించుకునే నాటికి, ఆ తర్వాత 2008కే జగన్ ఆస్తుల విలువ కొన్ని వందల రెట్లు పెరిగింది.. అంతేకాదు, జగన్ ఆస్తులు, నాటి అంశాలపై ఓ టాప్ ఎనలిస్ట్, మాజీ ఐఏఎస్ అధికారి ఓ అంశాన్ని గుర్తు చేసిన ఘటన.. ఇప్పటికీ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటుంది.. వైఎస్ ఇంటికి గతంలో ల్యాండ్ లైన్ ఫోన్ కోసం రికమండేషన్ కావాలని అడిగారట.. కానీ, నేడు కొన్ని వందల కోట్లు అధికారికంగా జగన్ పేరిట దఖలు పడ్డాయి..
బెంగళూరులోని అలహంకలో సుమారు 20 ఎకరాల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో మరో రాజప్రసాదం, ఇటు తాడేపల్లిలో మరో భారీ భవంతి, ఇక పులివెందుల ఇడుపాయలలో భారీ ఎస్టేట్.. బహిరంగంగా కనిపిస్తోన్న జగన్ ఆస్తులు ఇవి.. ఇక ఆయన కంపెనీల విలువ చూస్తే కోటానుకోట్లు ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. పవర్ ప్రాజెక్ట్ లు, సిమెంట్ ఫ్యాక్టరీలు, పేపర్ సంస్థలు, మీడియా హౌజ్ లు, మైనింగ్ ఇండస్ట్రీలు.. వందల ఎకరాల భూములు, ఇలా చెప్పుకుంటూ పోతే…. జగన్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లు ఉంటుందనేది ఊహకందని విషయం అంటారు ఎనలిస్టులు..
తాను వేల కోట్లకు అధిపతి అయినా, పక్కా బిజినెస్ మేన్ గా ఎదిగినా, జగన్.. రాష్ట్రాన్ని మాత్రం అప్పులతో బీద రాష్ట్రంగా మారుస్తుండడం విశేషం.. ఆయన తన ప్రతిభని, మార్కెట్ నైపుణ్యాన్ని, తెలివితేటలను రాష్ట్ర పురోభివృద్ధికి ఎందుకు ఉపయోగించడం లేదనే చర్చ సాగుతోంది.. వేల కోట్ల ముఖ్యమంత్రి.. బీద అరుపులు అరుస్తూ.. పేదలను ఉద్ధరిస్తానంటారు. మరి, ఆయనలా స్వతంత్రంగా వారిని కూడా ఇండస్ట్రియలిస్ట్ లుగా అవతరించేలా ఎందుకు చేయడం లేదని ప్రతిపక్ష నేతలే కాదు, సొంత పార్టీ నేతలు సైతం ప్రశ్నిస్తుంటారు.. మరి, వీటికి ఆయన ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి..