దేశంలోని ముఖ్యమంత్రులలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరంటే.. ఏపీ సీఎం జగన్ అని ఠక్కున చెప్పేస్తారు ఎవరయినా.. అది ఒక జనరల్ నాలెడ్జ్ బిట్ లా మారిపోయింది.. అంటే, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు..
దేశంలోని ముఖ్యమంత్రుల్లో.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత సంపన్నుడు. ఆయన ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఉంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అంతేకాదు.. ఇప్పుడున్న 30 మంది ముఖ్యమంత్రుల్లో.. 29 మంది కోటీశ్వరులేనని.. వీరిలో YS Jagan Mohan Reddy టాప్లో ఉండగా.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఖర్లో ఉన్నారు. ఆమె ఆస్తులు కేవలం రూ.15 లక్షలే అని ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ వెల్లడించింది.
దేశంలోనే అత్యధిక సంపాదన, ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రుల లిస్ట్ లో టాప్ లో ఉన్న జగన్.. రాష్ట్రాన్ని మాత్రం సర్వ నాశనం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. అధికారం చేపట్టిన నాలుగేళ్లలోనే ఏపీ ఆర్ధిక ముఖచిత్రం మొత్తం మార్చేశారు. ఏకంగా ఏడు లక్షల కోట్ల మేర అప్పులు చేశారనే వాదన వినిపిస్తోంది. చంద్రబాబు అధికారం కోల్పోయే నాటికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు ఉన్న ఏపీ అప్పులు.. నేడు ఏకంగా పది లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్ధిక విశ్లేషకులు బయటపెడుతున్న నిజాలు.. ఏపీ ప్రజలను భయపెడుతున్నాయి.. ఈ స్థాయిలో ఏ ముఖ్యమంత్రి అప్పులు చేయలేదని అభిప్రాయ పడుతున్నారు ఎనలిస్టులు..
వ్యక్తిగతంగా వందల కోట్లు సంపాదించడం తెలిసిన జగన్, తన కంపెనీలను సమర్ధవంతంగా నడిపి లాభాల బాట పట్టించడంలో సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ గా కీర్తి ప్రతిష్టలు దక్కించుకున్న జగన్.. రాష్ట్రాన్ని ఎందుకు విజయ తీరాల వైపు, పెట్టుబడుల వైపు నడపకుండా అప్పులలో ముంచెత్తుతున్నారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్… గా తిరుగులేని విధంగా ఆస్తులు దక్కించుకున్న జగన్… రాష్ట్రాన్ని దాదాపు దివాళా అంచుకు తీసుకువెళ్లారని ఆర్ధిక నిపుణులు గగ్గోలు పెడుతున్నారు.. నెత్తీ నోరు బాదుకుంటున్నారు.. అయినా ఆయన ఎడాపెడా అప్పులు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారనే చర్చసాగుతోంది.. ఏపీ ఆర్ధికంగా బలోపేతం కావడానికి జగన్ చేసింది సున్నా.. అని ఎకనామిస్టులే చెబుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యానాలు ప్రజలను భయపెడుతున్నాయి.. జీతభత్యాల కోసం ఓడీ మీద ఆధారపడాల్సిన పరిస్థితులతో రాష్ట్రం ఏ దిశగా నడుస్తోందనే చర్చ సాగుతోంది..
మొత్తమ్మీద, తన వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడంలో సక్సెస్ అయ్యి, పర్ ఫెక్ట్ బిజినెస్ మేన్ అనిపించుకున్న జగన్.. పరిపాలనలో మైనస్ మార్కులు వేయించుకుంటున్నారన్న అభిప్రాయం విద్యావంతులు, మధ్య తరగతి వర్గానికి చేరిపోయింది.. అందుకే, గంటా వెంకటేశ్వరరావు లాంటి ఎకనామిస్టులు ఏపీ ఆర్ధిక రంగంపై చేస్తున్న కామెంట్స్ , విశ్లేషణలకి నిలువునా వణికిపోతున్నారు.. భయపడిపోతున్నారు..