అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘లవ్ స్టోరీ’. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. క్రిస్మస్ కి కానీ.. సంక్రాంతికి కానీ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రిలీజ్ కానుంది. అందుకే లవ్ స్టోరీ క్రిస్మస్ కి కాకుండా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవ కాశాలున్నాయంటున్నారు.
అయితే.. ‘లవ్ స్టోరీ’ సినిమా పై నాగచైతన్య చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎప్పటి నుంచో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నాడు చైతూ. అది లవ్ స్టోరీతో సెట్ అయ్యింది. ఇదిలా ఉంటే… అతడి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ‘ఏమాయ చేసావే, 100% లవ్’ ఈ రెండు సినిమాలతో వరుసగా విజయాలు సాధించాడు. ఆతర్వాత ‘తడాఖా, మనం’ వరుసగా రెండు విజయాలు సాధించాడు. ఇలా వరుసగా రెండు సినిమాలతో విజయం సాధించాడు కానీ.. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ సాధించలేదు. ఎర్లియర్ గా ‘మజిలీ, వెంకీమామ’ సినిమాలతో వరుసగా రెండు విజయాలు సాధించాడు.
‘లవ్ స్టోరీ’ సినిమాతో మరో విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలనుకుంటున్నాడు. నాగ చైతన్యకు ప్రేమకథా చిత్రాలు బాగా కలిసొచ్చాయి. సో.. ‘లవ్ స్టోరీ’ మూవీ ఖచ్చితంగా విజయం సాధించి, చైతన్యకు హ్యాట్రిక్ అందిస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ సాంగ్ కు ట్రెమండస్ రెస్సాన్స్ రావడంతో లవ్ స్టోరీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి… అందరి అంచనాలకు తగ్గట్టుగా లవ్ స్టోరీ విజయం సాధించి.. చైతన్యకు హ్యాట్రిక్ అందిస్తుందని ఆశిద్దాం.