ప్రపంచమంతా కరోనా టీకా ప్రయోగాలు విజయవంతం కావాలని ఎంతగానో ఆశిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆక్స్ ఫర్డ్ టీకా కారణంగా బ్రిటన్ లోని ఒక పేషంట్ కు నాడీ సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీరమ్ కంపెనీ నుండి వివరణను కూడా అడిగింది ఐసిఎంఆర్. ప్రస్తుతం మూడో ప్రయోగాల్లో విజయవంతంగా దూసుకుపోతున్న సమయంలో చెన్నైకి ఒక వాలంటీర్ నాడీ సంబంధిత వ్యాధి తలెత్తిందని ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అసలెలా జరిగిందో అర్థం కాక కంపెనీ తలపట్టుకుంది. చివరికి, రిపోర్టలు పరిశీలించిన మీదట అసలు నిజం బయటపడింది.
అంతా మీ వల్లే… 5 కోట్లు కట్టండి…
చెన్నై కి చెందిన ఒక బిజినెస్ కన్సల్టెంట్ సెప్టెంబర్ 29 న వాలంటీర్ గా ఎంపికయ్యాడు. అక్టోబర్ 1న టీకా వేయించుకున్నాడు. మొదటి 10 రోజులు ఎటువంటి సమస్యలు తలెత్తలేదు. ఆ తర్వాత అతని ప్రవర్తనలో తీవ్ర మార్పులుచోటు చేసుకోవడంతో టీకా వేసిన హాస్పిటల్ లోనే చేర్పించారు. అక్టోబర్ 26 న డిశార్ఛి చేయడం జరిగింది. వీటిని పేర్కోంటూ వాలంటీర్ భార్య సీరమ్ కంపెనీని నిందిస్తూ, టీకా వల్లే ఈ స్థితికి వచ్చారని 5 కోట్లు చెల్లించాలంటూ పేర్కోంది.
టీకా కారణం కాదు
హాస్పిటల్ నుంచి డిశార్చి అవుతున్నప్పుడు ‘అక్యూట్ ఎన్ సెఫలోపతి’ నుండి కోలుకుంటున్నట్లు రాశారు. దానర్ధం కొన్ని విటమిన్ల లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. హాస్పిటల్ నివేదికల ప్రకారం టీకా ప్రభావం వల్ల ఈ అనారోగ్య సమస్యలు తలెత్తలేదంటూ కంపెనీ తెలియజేసింది. దీనికి సంబంధించిన నివేదిక సిద్ధం చేసి డిసిజిఐయూకి అందించింది సీరమ్.
100 కోట్లు కట్టాల్సి వస్తుంది
వాలంటీర్ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన సీరమ్ కంపెనీ, వారి వ్యాఖ్యలను ఖండిస్తూ కంపెనీ తరపున ఒక ప్రకటనను విడుదల చేసింది. వాలంటీర్ ఆరోగ్య సమస్యలకు టీకాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా, వారి వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను టీకాకు ఆపాదించే ప్రయత్నం చేశారని తెలియజేసింది. ఇటువంటి చర్యలను కంపెనీ తీవ్రంగా పరిగణిస్తుందని, వాలంటీర్ పైన 100 కోట్ల పరువు నష్టం వేస్తామని హెచ్చిరించింది.
ఇటువంటి చర్యలు తగునా
ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని టీకా కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి సమయంలో తమ స్వార్ధం కోసం ఇలాంటి ఆరోపణలు కేవలం కంపెనీ ప్రతిష్ఠని దెబ్బతీయడమే కాదు, ప్రజలను పక్కదోవ పట్టించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి చర్యల వల్ల ప్రయోగాల పై ఏమాత్రం ప్రభావం పడ్డా టీకా మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఇలాంటి సమయంలో తమ వంతు బాధ్యతగా వ్యవహారించడం చాలా అవసరం.