చింతపల్లిలో దారుణ హత్య ..!
ప్రపంచం సాంకేతిక పుంతలు తొక్కుతూ.. వేగంగా ముందుకు పోతున్న వేళా.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా అటవీక సాంప్రదాయాలు, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతునే ఉన్నాయి. చేతబడులు, బాణామతి, చిల్లంగి వంటి ప్రాచీన తంత్ర విద్యలు అప్పుడప్పుడు వెలగుచూస్తేనే ఉంటాయి. నల్గొండ, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి సివారు ప్రాంతాల్లో మూఢ విశ్వాసాల మాటున నిత్యం నరబలులు జరుగుతూనే ఉంటాయి. ఇటువంటి నరబలులకు ఒకప్పుడు అడవులు, ఊరి పొలిమేర్లు వేదికలుగా మారేవి. అయితే తాజాగా నల్గొండ జిల్లా చింతపల్లిలో జరిగి ఘటన యావత్తు ప్రజలను నివ్వెరబోయేలా చేశాయి. చింతపల్లి మండలంలో హైదరాబాద్ – నాగార్జున సాగర్ రాష్ట్ర ప్రధాన రహదారిపై ఉన్న మెట్ట మహంకాళి దేవాలయంలో అమ్మవారి కాళ్ల వద్ద ఓ వ్యక్తి తలను మొండం నుంచి వేరు చేసి పెట్టారు. ఆ మొండెం లేని తలను చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. పోలీసులు సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలాన్ని పరిశీలించారు. తల ఎవరిది, ఇక్కడే వేరు చేశారా? మరికెక్కడైనా పూజలు చేసి, తీసుకొచ్చి ఆలయానికి తీసుకొచ్చారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కాళికామాత ఆలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు ఒక్కసారి భయభ్రాంతులకు గురౌతున్నారు.











