టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హిందూపురం ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 2024లో వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, చంద్రబాబు నాయుడు చస్తాడని వ్యాఖ్యానించారు.. ఈ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. మాజీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి శపించడం, శాపనార్ధాలు పెట్టడం వరకు ఓకే.. కానీ, గోరంట్ల మాధవ్ తన హద్దులు దాటి, నోటి దూలతో ఊహించని వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.. ఆయన వ్యాఖ్యలని, సొంత పార్టీ నేతలే సమర్ధించలేని స్థితికి చేరుకున్నారు..
గోరంట్ల మాధవ్ కామెంట్స్ వెనక అనేక అంశాలు ముడిపడి ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాలలో మొదలయింది.. గత ఎన్నికలకు ముందు ఒక సాధారణ సీఐగా ఉన్న ఆయనకి జగన్ పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇచ్చారు.. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని జగన్ వేవ్‌లో ఎంపీగా గెలిచిన మాధవ్… ఆ తర్వాత ఓ నగ్న వీడియోతో ఆయన తన నిజరూపం దర్శనం చూపించి దుమారం రేపారు. ఓ మహిళతో అసాధారణ భంగిమలో చాట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.. ఈ వ్యవహారంతో జాతీయ స్థాయిలో వైసీపీ పరువు మంట గలిసింది.. ఇది కొన్ని చానెల్స్, ఓ పార్టీ కుట్ర అని బుకాయించడానికి ఎంత ప్రయత్నించినా మరింతగా మాధవ్, ఆయన పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందే తప్ప, ఫలితం దక్కలేదు.. ఈ ఘటన తర్వాత మాధవ్‌ని పార్టీ నుండి బహిష్కరిస్తారని, ఆయన స్థానంలో ఉప ఎన్నిక వస్తుందని లెక్కలు కట్టారు కొందరు.. కానీ, జగన్ అంతటి ధైర్యం చేయలేకపోయారనే వాదన ఉంది..
తాజాగా గోరంట్ల మాధవ్… టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేయడానికి కూడా ఇదే కారణం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ పార్టీకి చేసిన నష్టానికి ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు.. వైసీపీ నుండి మరో పార్టీకి జంప్ చేద్దామన్నా.. .ఎక్కడా ఆయనకు చోటు ఇవ్వరు.. మాధవ్ చేసిన డ్యామేజ్, ఆయన ఇమేజ్ అలాంటిది.. ఎంపీ కాకుండా ఉండి ఉంటే జగన్ ఎప్పుడో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఉండేవాడు.. ఎంపీగా ఆయనపై బహిష్కరణ వేటు వేస్తే, ఉప ఎన్నికకు సిద్ధం కావాలి. అంత డేర్ జగన్ చేయలేడు.. అందుకే, దాదాపు రెండేళ్లపాటు మాధవ్‌ని కాపాడుకుంటూ వస్తున్నాడు జగన్…
తాజాగా ఎన్నికల హీట్ మొదలయింది.. అనంతపురం జిల్లాలో టికెట్ ఇవ్వని జాబితాలో గోరంట్ల మాధవ్ పేరు ఫస్ట్ లిస్ట్‌లోనే ఉంటుంది.. ఇదే ఆయన భయం.. అటు పాత జాబ్‌లోకి వెళ్లలేడు.. ఇటు రాజకీయాలలోనూ ఇమడలేడు. ఇలా జీవితం రెంటికీ చెడ్డ రేవడిగా మారిందనే చర్చ నడుస్తోంది.. ఇలాంటి అభద్రతా భావంలోనే చివరగా చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేల్చితే అయినా వాటికి ఇంప్రెస్ అయి టికెట్ ఇస్తాడేమో అన్న చివరి ప్రయత్నంలో ఉన్నాడట గోరంట్ల మాధవ్.. చంద్రబాబు, ఆయన కుటుంబంపై విమర్శలు చేసిన వారిని ప్రోత్సహించడం, వారిని లైవ్‌లోనే వెన్ను తట్టి ప్రోత్సహించడం వంటి విజువల్స్ చూసిన గోరంట్ల మాధవ్… మానవ ప్రయత్నం చేస్తున్నాడట.. ఏది ఏం జరిగినా, గోరంట్ల మాధవ్ తన కెరీర్‌ని ఆయనే చేజేతులారా నాశనం చేసుకున్నాడు.. అలాంటి వ్యక్తిని సమాజం హర్షించదు.. పార్టీలు ప్రశంసించవు..
తాజాగా చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలతో ఆయన పతనం మరింత వేగంగా ప్రారంభం అయిందనే వాదన వినిపిస్తోంది.. ఇప్పటికే, బూతు వ్యాఖ్యలతో టికెట్ ఇవ్వడం కష్టమని మంత్రి రోజాపైనే లీకులు ఇస్తోంది వైసీపీ… ఈ విషయం స్పష్టంగా అర్ధం అయింది గోరంట్లకు.. ఇలా మరోసారి తన ఖర్మకు తానే బాధ్యుడు అవుతున్నాడు గోరంట్ల.. మరి, రాబోయే రోజుల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి..