ఇవాళ నందమూరి తారక రామారావు జయంతి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్ తో సహా పలువురు నాయకులు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులు అర్పించారు. అయితే ఎన్టీఆర్ ఘాట్ లో అందరి చూపు దేవాన్స్ మీదే పడ్డాయి. లోకేశ్ ఎన్టీఆర్ నివాళులు అర్పించిన తర్వాత, దేవాన్ష్ కూడా సమాధిపై పూలు చల్లి ఎన్టీఆర్ కు నివాళులు అర్పించాడు. ముత్తాతకు మునిమనువడు దేవాన్ష్ నివాళులు అర్పించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. కరోనా వేళ.. దేవాన్ష్ మాస్కు ధరించి తండ్రి అడుగుల్లో అడుగు వేస్తూ కనిపించాడు.