ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్‌కు ప్రతిష్టాత్మక JEE – నీట్ కోచింగ్ అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. కోచింగ్‌తో పాటు స్టడీ మెటిరీయల్ కూడా ఉచితంగా అందించనున్నారు. దీంతో ఏపీలోని 1355 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లక్ష మంది విద్యార్థులకు మేలు జరగనుంది.
ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఓ సంస్కరణ తీసుకురావడం తనకు గర్వంగా ఉందన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యూకేషన్‌కు నిదర్శనమన్నారు లోకేష్. దేశంలోనే ఇలాంటి ప్రయత్నం మొదటిదన్నారు లోకేష్. జాతీయ స్థాయిలో పోటీ పడాలనుకునే గ్రామీణ విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రైవేట్ సంస్థల తరహాలోనే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు..రోజువారీ కోచింగ్, ఎక్ట్స్రా స్టడీ అవర్స్, మోడల్ టెస్స్ట్ ఉంటాయన్నారు. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు.
నాణ్యమైన విద్య అనేది ప్రతి బిడ్డ హక్కు అని చెప్పారు లోకేష్. ఈ ప్రయత్నం ఏపీలోని ప్రతి విద్యార్థి పెద్ద కలలు కనేందుకు, పెద్ద విజయాలు సాధించేందుకు ఉపయోగపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం తరగతి గదులనే కాదు..దేశ భవిష్యత్‌కు పునాదులు వేస్తోందన్నారు లోకేష్.











