కల్తీ సారా మరణాలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూడవ రోజు తన ఆందోళనను కొనసాగించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి లోకేష్ ఆధ్వర్యంలోని టిడిపి శాసనసభాపక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే అన్యాయంగా తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో “సారా అగ్గి – సంసారం బుగ్గి” అంటూ తెలుగుదేశం నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. సిఎం మాటలు, పోలీసు ఎఫ్ఐఆర్ లు వీటిలో ఏది నిజం అంటూ నినాదాలు చేశారు.అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చేస్తున్నవన్నీ అసత్య ప్రకటనలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్నవి సహజ మరణాలు కాదని, అవన్నీ జగన్ కల్తీసారా మరణాలే అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో జగన్ ఇంకెన్ని సారా చావులు కోరుకుంటున్నారో చెప్పాలని తమ నిరసనను కొనసాగించారు.
Must Read:-సిఎం జగన్ పై సభా హక్కుల నోటీసు ఇచ్చిన టిడిపి