సిఎం జగన్ పై టిడిపి ఉభయ సభల సభ్యులు సభా హక్కుల నోటీసు ఇచ్చారు.జంగారెడ్డి గూడెం కల్తీ సారా మరణాలను సహజమరణాలుగా చిత్రీకరించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభను, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈ నోటీసు ఇచ్చారు.పశ్చిమ గోదావరి జిల్లా మృతుల పట్ల విచారణ కోరితే పట్టించుకోలేదని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. మృతుల విషయమై సీఎం జగన్‌రెడ్డి గుడ్డిలెక్కలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ పెద్దలు వాస్తవాలు తెలుసుకోకుండా నాటుసారా కాయలేదనడం సరికాదని అన్నారు.ప్రభుత్వం మద్యం ధరలు పెంచడం వల్లనే ప్రజలు నాటుసారా తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారని, అదీ కల్తీ అయిపోవడంతో అమయాక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Must Read:-జగన్‌పై కడప సర్పంచ్‌లే తిరుగుబాటు.. మూకుమ్మడి రాజీనామాలు!