కరోనా కేసులు పెరుగుతున్నా.. జగన్ రెడ్డి ప్రజారోగ్యం పట్టించుకోకుండా పరీక్షలు నిర్వహిస్తానని చెప్పడం ముర్ఖత్వమే అవుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఇక ఆయన ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పాలిట కంసుడు అని తేలిపోయిందని మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలూ పరీక్షలు రద్దు, వాయిదా వేస్తే, ఒక్క ఏపీలోనే పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం, జగన్‌రెడ్డి మూర్ఖత్వానికి పరాకష్ట అని అన్నారు. జనం పిట్టల్లా రాలుతున్నా ఎందుకు పట్టింపులేదని ప్రశ్నించారు. పరీక్షల పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం ఫ్యాక్షన్ సీఎంకి తగదని అన్నారు. ఏపీలో కరోనా మరణాలను ప్రభుత్వం దాచిపెడుతుందని నారా లోకేశ్ ఆరోపించారు.
Must Read : పరీక్షలు కాదు.. పిల్లల ప్రాణాలే ముఖ్యం: నారా లోకేశ్