కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా… కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో 3,052 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి బారినపడి నిన్న ఏడుగురు మృతి చెందగా, తాజాగా 778 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం 24,131 యాక్టివ్ కేసులుండగా.. 16,118 మంది హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్ మరణాల రేటు 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 92.21 శాతం ఉందని తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా పోలీసులు మూడు కమిషనరేట్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారు. మాస్క్ ధరించనివాళ్లకు రూ. వెయ్యి జరిమానా విధించారు. మాస్కులు పెట్టుకోనివాళ్ల ఫొటోలు తీస్తూ, తగు సూచనలు చేస్తున్నారు.
Must Read ;- డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్..