అమరావతిపై వైసీపీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారు. అదే నోటి దురుసు ప్రదర్శిస్తున్నారు. ఐదేళ్ల పాటు అమరావతిని నిర్లక్ష్యం చేసిన జగన్..ఇప్పుడు తన నేతలు, అనుచరులతో అమరావతిపై కుట్రలు చేస్తున్నారు. తాజాగా అమరావతిని ఉద్దేశించి వైసీపీ అనుకూల జర్నలిస్ట్ కృష్ణంరాజు సాక్షి టీవీ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. అమరావతి దేవతల రాజధాని కాదు…వేశ్యల రాజధాని అంటూ కృష్ణం రాజు చేసిన కామెంట్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు మండిపడుతున్నారు. వైసీపీని చెప్పుతో కొట్టినట్లుగా రాష్ట్ర ప్రజానీకం సమాధానమిచ్చినా ఇంకా మారడం లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అమరావతి దేవతల రాజధాని అని టీడీపీ ప్రచారం చేస్తుంటే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారు. కడుపు మంటతో రగిలిపోతున్నారు. అమరావతి మహిళలను కించపరచడం వైసీపీకి ఇది మొదటి సారి కాదు. గతంలో మూడు రాజధానుల పేరుతో జగన్ కుట్రలు చేస్తే..వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దాదాపు వెయ్యికిపైగా రోజుల పాటు నిరసనలు, నిరాహార దీక్షలతో రాజధాని కోసం శాంతియుతంగా పోరాడారు. జగన్ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని మాటలన్న వెనక్కి తగ్గలేదు. మొక్కవోని దీక్షతో నిరసనలు కొనసాగించి..చివరకు మళ్లీ కూటమి సర్కార్‌ను గెలిపించి, జగనాసురుణ్ణి గద్దె దించి అమరావతిని సాధించుకున్నారు. నిజంగా అమరావతి దేవతల రాజధానే.
వైసీపీ అనుకూల జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు. వైసీపీ అధినేత జగన్‌కు ప్రశ్నలు సంధించారు లోకేష్. మహిళలను ఇంత ఘోరంగా అవమానించడం కరెక్టేనా అని జగన్‌ను నిలదీశారు. అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద ద్వేషంతో అసత్యప్రచారం చేయడం మీ దిగజారుడుతనానికి పరకాష్ట అంటూ లోకేష్ నిప్పులు చెరిగారు.
అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే అన్నారు లోకేష్. భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతని పేర్కొన్నారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అన్నారు లోకేష్. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతిగా పేర్కొన్నారు. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని ప్రశ్నించారు లోకేష్.











