ఈ అనంత విశ్వంలో చిత్ర విచిత్రాలకు కొదువ లేదు. ఈ ఫొటో చూశారా..! ‘విశ్వ’ సుందరి మెడలో అలంకృతమై దేదీప్యమానంగా వెలిగిపోతున్న నక్షత్ర హారం.. ధగ ధగలాడుతూ.. కళ్లు మిరుమిట్లు గొలుపుతోంది కదూ! ఇది మనకు 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్ర మండలం. అక్కడ ఓ భారీ నక్షత్రం పేలడంతో.. దాని నుంచి విడివడిన ముక్కలు ఇలా ఓ హారంలా ఏర్పడ్డాయి. ఈ హారం ఆకృతి 19 లక్షల కిలోమీటర్ల వ్యాసంలో విస్తరించి ఉందని అంచనా.

ఈ అద్భుతమైన ఫొటోను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విడుదల చేసింది. దీనికి ట్యాగ్ ను కూడా జత చేసింది. ‘మనం ప్రస్తుతం విశ్వాభరణ దుకాణంలోకి వెళుతున్నాం. ఇక్కడ ఉన్న వజ్రాల హారాన్ని పోలిన అద్భుతమైన నక్షత్ర హారాన్ని చూస్తున్నారా! ఇది మనకు 15 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అక్కడ పేలిన నక్షత్రం.. 19 లక్షల కిలోమీటర్ల వ్యాసంలో ఈ భారీ నక్షత్ర హారాన్ని ఏర్పరిచింది’ అని పేర్కొంది. ఈ ఫొటో.. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Must Read ;- నాసాలో మన భారతీయ మహిళ ‘స్వాతి మోహన్’..