పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ .. తన ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో అతి ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా లో ఆయన ఎలా కనిపించబోతున్నారనే ఆత్రుత అందరిలోనూ ఉంది. నిజానికి ఇదో పీరియాడికల్ మూవీ. హిస్టారిక్ బ్యాక్ డ్రాప్ కలిగిన ఫిక్షనల్ మూవీ. ఇందులో పవన్ పేరు మోసిన బందిపోటు నాయకుడిగా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి.
ఇక ఈ సినిమాకి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించినట్టూ వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫష్ట్ లుక్ పోస్టర్ ను శివరాత్రి కానుకగా.. మార్చ్ 11 రివీల్ చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు కూడా. అయితే అభిమానులు అంతవరకూ ఆగక్కర్లేకుండానే.. ఈ సినిమా కు సంబంధించిన పవన్ స్టార్ గెటప్ అంతర్జాలంలో ఎవరో లీక్ చేయడంతో .. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
లీక్డ్ ఫోటోస్ లో పవన్ .. కాస్ట్యూమ్స్ చూస్తుంటే.. ఆయన బందిపోటు దొంగ అనే విషయం క్లియర్ గా అర్ధమవుతోంది. అలాగే.. ఆయన ఫైటింగ్ మోడ్ లో ఉన్నట్టు కూడా స్పష్టమవుతోంది. ఈ గెటప్ ఇలా బైటికి రావడంతో .. ఈ వ్యవహారం దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ.యం.రత్నం కి తలపోటుగా మారింది. ఎంత పకడ్బందీగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ .. పవన్ గెటప్ కు సంబంధించిన ఫోటో లీక్ అవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి మార్చ్ 11న విడుదలయ్యే పవర్ స్టార్ గెటప్ ఎలా ఉండబోతోందో చూడాలి.