‘మార్స్ పైన మన శాటిలైట్ విజయవంతంగా ల్యాండ్ అయింది’.. ఈ మాట వినగానే అందరిలో హర్షాతిరేకాలు. ఈ అనౌన్స్‌మెంట్ చేసింది నాసా ప్రయోగశాలలో నావిగేషన్ లీడ్‌గా పనిచేస్తున్న మన భారతీయ సంతతికి చెందిన ‘స్వాతి మోహన్’. ఆమె అమెరికాలోని నాసాలో మార్స్ 2020 గైడెన్స్, నేవిగేషన్, అండ్ కంట్రోల్స్(జీఎన్ అండ్ సీ)కి స్వాతి మోహన్ ఆపరేషన్స్ లీడ్‌గా పనిచేస్తున్నారు. శాటిలైట్ ప్రయోగం విజయవంతమైనదని స్వాతి చేసిన అనౌన్సమెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ మారింది. ముఖ్యంగా ఆమె ముఖాన ధరించిన ‘బొట్టు’ గురించే ట్విట్టర్‌లో అందరూ మాట్లాడుకోవడం విశేషం. ‘ఇండియన్ బింది ఇన్ అమెరికా నాసా’ అంటూ స్వాతి మోహన్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
"The spacecraft @NASAPersevere is currently transmitting heartbeat tones — these tones indicate that Perseverance is operating normally."
Swati Mohan, @NASAJPL engineer on the rover's landing team, provides a status update on the #CountdownToMars: pic.twitter.com/D1Tx9BEYld
— NASA (@NASA) February 18, 2021
అసలెవరీ స్వాతి మెహన్?
సాధారణంగా ఒక తొమ్మిదేళ్ల వయసున్న అమ్మాయిని ఏమవుతావు అనడిగితే ఏం చెప్తుంది? ఏం చేయాలో నిర్దారించుకునే ఆలోచన కూడా ఉండదు ఆ వయసుకి. కానీ స్వామి తొమ్మిదేళ్ల వయసులో అంతరిక్షానికి సంబంధించిన ‘స్టార్ ట్రెక్’ అనే సీరిస్‌ని చూసిన స్వాతికి స్పేస్ పట్ల ఆసక్తి ఏర్పడించి. ఇక అప్పటి నుంచి ఎలాగైనా అంతరిక్ష పరిశోధనలో భాగం కావాలని కలల కనడం మొదలు పెట్టింది. చివరకు తను అనుకున్నది సాధించి చూపింది స్వాతి.
Must Read ;- నాది ‘మార్స్’.. భూగ్రహవాసులను కాపాడడానికి వచ్చాను!
If you watched the Mars landing today, the voice you heard was @DrSwatiMohan. She immigrated to the US from India at age 1, was inspired by Star Trek at 9, then earned a B.S from Cornell in mechanical and aerospace engineering, and an M.S. and Ph.D from MIT in aeronautics. pic.twitter.com/mHZQmz3iPD
— Paul Rogers (@PaulRogersSJMN) February 18, 2021
స్వాతికి ఏడాది వయసున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వృత్తి రిత్యా వలస వెళ్లారు. నార్త వర్జీనియా, వాషింగ్టన్ డీసీలో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తిచేసి, కార్నల్ విశ్వవిద్యాలయంలో మెకానికల్ & ఏరో స్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచులర్ డిగ్రీని పూర్తిచేసింది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎమ్మెస్, పీహెచ్‌డి పూర్తిచేశారు స్వాతి. ఆపై నాసాలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించారు. ప్రస్తుతం 2013 లో ప్రారంభమైన మార్స్ 2020 నావిగేషన్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read ;- అంతరిక్షంలోకి అడుగిడనున్న మోడీ..!