టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఏపీలో అప్పుడే 6 నెలల పాలననుు పూర్తి చేసుకుంది. టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఈ సర్కారు కేవలం ఈ స్వల్ప కాల వ్యవధిలోనే ఓ గొప్ప విజయాన్ని నమోదు చేసిందని చెప్పక తప్పదు. ఏపీ వైపు చూడాలంటేనే అన్ని వర్గాలు తీవ్రంగా భయపడిపోయేవి. పారిశ్రామిక వర్గాలు అయితే ఏపీ పేరును ప్రస్తావించేందుకు కూడా సాహసించేవి కావు. అలాంటి ఏపీ పట్ల ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆశావహ దృక్పథం కనిపిస్తోంది. ఈ 6 నెలల పాలనలో కూటమి సర్కారు సాధించిన అతిగొప్ప విజయం ఇదేనని చెప్పాలి. 6 నెలల పాలన పూర్తి చేసుకున్న దరిిమలా… బుధవారం కూటమి సర్కారు ఓ కరపత్రాన్ని విడుదల చేసింది. 6 నెలల పాలనలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలివేనంటూ సదరు కరపత్రంలో కూటమి పార్టీల నేతలు చెబుుతున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన పలు హామీల అమలులోనూ కూటమి సర్కారు మంచి పురోగతినే సాధించిందని కూడా చెప్పాలి.
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీతో బీజేపీ,. జనసేన జత కలిశాయి. తమ కూటమి అధికారంలోకి వస్తే… 6 హామీలను అలు చేస్తామని ఆ పార్టీల నేతలు చెప్పారు. వాటిలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మహిళలకు నెలకు రూ.1,500 నగదు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000, రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం ఉన్నాయి. ఇక ఈ సూపర్ సిక్స్ లో లేని చాలా హామీలను కూడా కూటమి రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. వాటిలో కీలకమైన పింఛన్ల సొమ్ము పెంపును వెనువెంటనే అమలు చేసింది. ఆ తర్వాత సూపర్ సిక్స్ హామీల అమలుప దృష్టి సారించిన కూటమి సర్కారు… ఇటీవలే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని అమలులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. పాలన మొదలుపెట్టిన 6 నెలల్లోనే ఈ కీలకమైన హామీని అమలులోకి తీసుకురావడం నిజంగానే మంచి పరిణామమేనని చెప్పాలి. త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు రచించింది. ఈ సంక్రాంతికి ఈ పథకాన్ని మొదలుపెట్టేందుకు రంగం సిద్ధం అయ్యింది.
ఇక విద్యార్థులకు రూ.15,000, మహిళలకు రూ.1,500, రైతులకు రూ.20,000 పథకాలను కూడా త్వరలోనే కూటమి సర్కారు అమలు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇక 20 లక్షల ఉద్యోగాల విషయంలో ఇప్పటికే కూటమి సర్కారు ఘన విజయాన్నే సాధించిందని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పలు కంపెనీల ద్వారా ఈ 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 34 వేల ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఉద్యోగాలు అందిరాావడానికి కాస్తంత సమయం పట్టినా… రాష్ట్ర ప్రభుత్వంతో ఆయా కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఇక ఐటీ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా ఏపీ పట్ల ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు ఏపీలో అడుగుపెట్టడం ఖాయమేనని తేలిపోయింది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే స్థలం కొనుగోలు చేయగా… గూగుల్ స్థలాన్ని కొనుగోలు చేసే ప్రక్రియను మొదలుపెట్టింది.
ఇక అమరావతిలో కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు చాలా కంపెనీలు పోటీ పడుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధుల్లో కూటమి సర్కారు కేవలం 6 నెలల వ్యవధిలోనే రూ.26 వేల కోట్లను సమీకరించగలిగింది. అంతేకాకుండా అమరావతికి ప్రత్యేక రైల్వే లైనును కూడా సాధించగలిగింది. విజయవాడ, విశాఖల్లో మెట్రో రైైలు ప్రాజెక్టులకు కూడా కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ సాధించింది. ఈ పరిణామాలన్నింటినీ ఆసక్తిగా గమనిస్తున్న పారిశ్రామికవేత్తలు ఎప్పుుడెప్పుడు ఏపీలో తమ కార్యకలాపాలను మొదలుపెడదాం అన్న దిశగా అడుగుులు వేస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కూటమి సర్కారు పనితీరు పట్ల అన్ని వర్గాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.